బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంతో, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ( Former MP Ponguleti Srinivas Reddy )తీవ్రంగా స్పందించారు .చాలా కాలంగా బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా, పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్న బీ ఆర్ ఎస్ అధిష్టానం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Former Minister Jupalli Krishna Rao ) ను సస్పెండ్ చేశారు.
ఈ వ్యవహారం పై తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ సభ్యుడినే కాదు అన్నప్పుడు తనను ఎలా సస్పెండ్ చేశారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
జనవరి నుంచి తాను ప్రభుత్వన్ని విమర్శిస్తూనే ఉన్నానని, వంద రోజుల తరువాత అయినా బీఆర్ ఎస్ నేతలు ధైర్యం తెచ్చుకుని నన్ను సస్పెండ్ చేశారని పొంగులేటి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అంశాన్ని పొంగులేటి ప్రస్తావించారు.

తాను వైసీపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ( BRS )లోకి రావాలని కేసిఆర్ ఎన్నోసార్లు ఆహ్వానించారని , తనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చారని , కేటీఆర్ అనేకసార్లు తనతో మాట్లాడి ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్తానని అప్పట్లో చెప్పారని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ కూడా హామీ ఇచ్చారని , మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకున్నారని పొంగిలేటి ఫైర్ అయ్యారు. ‘ మా గతి మీకు పడుతుందని చాలామంది బి ఆర్ ఎస్ నేతలు అప్పుడే చెప్పారు.పాలేరు ఉప ఎన్నికల్లో విజయం కోసం నాపై ఒత్తిడి తెచ్చారు.ఆరు నెలలు మా సార్ నన్ను కింద నడవనీయరని తోటి ఎంపీలు చెప్పారు.ఆరు నెలల తర్వాత మా సార్ అసలు రూపం తెలుస్తుందని అన్నారు.ఆరు నెలలు కాదు నా విషయంలో ఐదు నెలల లోనే పరిస్థితి అర్థం అయింది.

బంగారు తెలంగాణ చేస్తామని ఇప్పుడేం చేస్తున్నారు .గత ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వకపోయినా కేటీఆర్ కోసమే పార్టీలో ఉన్నాను.ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీలో కొనసాగాను.2018లో ఖమ్మం జిల్లా నుంచి ఒక ఎమ్మెల్యేనే గెలవడానికి కారణం ఏమిటో చర్చించారా ? ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టు ‘ అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.