ఏ పార్టీ నాయకుడికైనా కావాల్సింది విశ్వసనీయత.ముందు తనపై తనకు నమ్మకం కుదరాలి.
తర్వాత.తనపై ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాలి.
అయితే. ఈ రెండు విషయాల్లోనూ సోము వీర్రాజు విఫలమయ్యారు.
పార్టీ విషయాన్ని తీసుకుంటే.సోము వీర్రాజును ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు.
తాజాగా ఆయన విశాఖ ఉక్కు విషయంలో కేంద్రంలోని పెద్దల మెడలు వంచుతామన్నారు.విశాఖ ప్రజలకు బీజేపీ ఎట్టి పరిస్థితిలోనూ అన్యాయం చేయబోదని హామీ కూడా ఇచ్చారు.
కానీ.కేంద్రమే ఆయనకు కనీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా నడ్డివిరగొట్టి.
ఏపీకి తిరిగి పంపించింది.
ఇక, విశాఖ ప్రజలకు ఇప్పుడు మొహం చూపించే పరిస్థితి లేకుండా పోయింది.
పైగా కేంద్రం వద్ద తనకు పలుకుబడి ఉందని.తాను.
ఆర్ ఎస్ ఎస్ మూలాల నుంచి వచ్చానని.చెప్పుకొనే సోముకు ఇప్పడు అదే ఆర్ ఎస్ ఎస్ వద్ద ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
దీంతో ఆయన వ్యవహారంపై పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.రాష్ట్రంలో నేతలను నడిపించలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ముఖ్యంగా రెండు సామాజిక వర్గాలకు పార్టీని దూరం చేస్తున్నారని పార్టీలో నే విమర్శలు వస్తున్నాయి.జిల్లాల వారీగా చూసుకుంటే.
కమ్మ వర్గం మూడు జిల్లాల్లో బలంగా ఉన్నప్పటికీ.సోము వీరిని చేరదీసేందుకు ఇష్టపడడం లేదు.

ఇక, క్షత్రియ సామాజిక వర్గం మరో రెండు జిల్లాల్లో కీలకంగా ఉన్నా.వారికి కూడా సోము ముఖం చాటేస్తు న్నారు.అసలు ఆయనకంటూ.ఓ వ్యూహమే లేకుండాపోయిందని చెబుతున్నారుపరిశీలకులు.కేంద్రం నుంచి వస్తున్న వ్యతిరేక నిర్ణయాలను తనకు సానుకూలంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా సోము దగ్గర సబ్జెక్టు లేదని అంటున్నారు.ఎవరో రావాలి.
పార్టీని ముందుకుతీసుకు వెల్లాలి.అనే ధోరణిలోనే సోము ఉన్నారు తప్ప.
తనకంటూ.ఆలోచనలు.
వ్యూహాలు లేక పోవడం పెద్ద మైనస్‌గా మారిపోయింది.
గతంలో కంభంపాటి హరిబాబు కూడా ఇలానే చేశారనే వాదన ఉండేది.
ఆ తర్వాత వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కొంత దూకుడు చూపించారు.అయితే.
ఆయనకు ఆర్ ఎస్ ఎస్ మూలాలు లేవంటూ.ఇదే సోము.
పొగబెట్టారు.పోనీ.
ఇప్పుడు తనేమన్నా.పార్టీని ముందుకు నడిపిస్తున్నారా? ప‌్రతిపక్షాలు, అధికార పక్షం నుంచి వస్తున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్తున్నారా? అంటే.అది కూడా కనిపించడం లేదు.దీంతో సోము ఫేడవుట్ నాయకుడిగా మిగిలిపోతారనే వాదన బలంగా వినిపిస్తోంది.