మీరు గే కదా అంటూ కరణ్ ను ప్రశ్నించిన నెటిజన్... స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు కరణ్ జోహార్( Karan Johar ).

ఈయన ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించడమే కాకుండా కొన్ని సినిమాలకు డైరెక్టర్ గాను అలాగే నిర్మాతగాను ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ తన సినీ కెరియర్ పట్ల ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు ఈయన పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.

The Netizen Asked Karan If He Was Gay , Karan Johar, Dharma Productions, Yash, R

ఈ విధంగా తన కొడుకు పేరు యష్( Yash ) కాగా కూతురు పేరు రూహి( Ruuhi ).ఈ పిల్లల తల్లి ఎవరు అనేది తెలియదు.కరణ్ జోహార్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనే సందేహాలు తరచూ అందరిలోనూ కలుగుతూ ఉంటాయి.

అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా చిట్ చాట్ చేసినటువంటి కరణ్ జోహార్ ను ఒక నెటిజన్ ప్రశ్నిస్తూ మీరు గే( Gay ) (స్వలింగ సంపర్కుల)నా? అని అడిగారు.సదరు ప్రశ్నకు ఏమాత్రం తడుముకోకుండా కరణ్ జోహార్ తన స్టైల్లో సమాధానం చెప్పారు.

The Netizen Asked Karan If He Was Gay , Karan Johar, Dharma Productions, Yash, R
Advertisement
The Netizen Asked Karan If He Was Gay , Karan Johar, Dharma Productions, Yash, R

ఈ సందర్భంగా కరణ్ జోహార్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.నీకు ఇంట్రెస్ట్ ఉందా? అని సమాధానం ఇచ్చాడు.తాను గేనా కాదా? అనే విషయం చెప్పకుండా నీకు ఆసక్తి ఉందా అని అడగడంతో సదరు నెటిజెన్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి.సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు కనుక సెలబ్రిటీలకు ఎదురైతే వారు సమాధానాలు చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడరు.

కానీ కరణ్ ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయకుండా నేటిజన్ అడిగిన ప్రశ్నకు తన స్టైల్ లో సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా నెటిజన్ షాక్ అయ్యారు.ఇక ఈయన ఇండస్ట్రీలో ధర్మ ప్రొడక్షన్స్( Dharma Productions ) పేరుతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా తన మార్క్ ఏంటో నిరూపించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు