సింగపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

సింగపూర్ చాలా అందమైన దేశం.సింగపూర్ చాలామందికి ఇష్టమైన పర్యాటక ప్రదేశం.

సింగపూర్ ప్ర‌జ‌ల‌కు పరిశుభ్రత పట్ల మక్కువ అధికం.

ఇక్క‌డ అనేక‌ చట్టాలు అమలులో ఉన్నాయి.

వాటిని పాటించకపోతే జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంది.జరిమానాలు కూడా చెల్లించవలసి వ‌స్తుంది.

మీరు సింగపూర్‌ను సందర్శించబోతున్నట్లయితే, అక్కడి నియమాల గురించి ముందుగా తెలుసుకోండి.సింగపూర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఉమ్మివేయడంఇక్కడ ఎవ‌రైనా బహిరంగ ప్రదేశంలో ఉమ్మివేస్తే, వారు 1000 డాలర్ల జరిమానా చెల్లించాలి.అలాగే జైలు శిక్ష‌ను ఎదుర్కోవలసి వ‌స్తుంది.

చూయింగ్ గమ్సింగ‌పూర్‌లో చూయింగ్ గమ్ మీద నిషేధం ఉంది.ఎవరైనా చూయింగ్ గమ్ అమ్మితే అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానా ఉంటుంది.

చెత్త వేయుడంసింగ‌పూర్‌లో అపరిశుభ్రతను వ్యాపింపజేసే వారు 300 డాల‌ర్ల వరకు జరిమానా చెల్లించవలసి వ‌స్తుంది.జైలు శిక్ష కూడా విధిస్తారు.

ఎవరైనా ఇలా పదే పదే చేస్తే వారం రోజుల పాటు వీధులను శుభ్రం చేయాల‌నే శిక్ష విధిస్తారు.నగ్నంగా తిరిగితేసింగ‌పూర్ లో న‌గ్నంగా ఇంటి చుట్టూ తిరగకూడ‌దు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
తండ్రి వెల్డింగ్ షాప్ లో ఉద్యోగి.. కూతురు టెట్ టాపర్.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇలా చేస్తూ ఎవరైనా పట్టుబడితే భారీ జరిమానా చెల్లించాల్సి వ‌స్తుంది.ధూమపానంఅక్కడ ఇంటిలో మాత్రమే సిగరెట్లు తాగవచ్చు.

Advertisement

బహిరంగ ప్రదేశాలు, వాహనాల్లో మీరు పొగ తాగ‌కూడ‌దు.ప్రయాణ సమయంలో సిగరెట్లను తీసుకెళ్లకూడ‌దు.

ఫ్లష్ చేయక‌పోతేసింగ‌పూర్‌లో టాయిలెట్‌ను ఫ్లష్ చేయకపోతే, మీరు 150 డాల‌ర్ల జరిమానా చెల్లించాలి.పావురాలకు ఆహారంఅక్కడ పావురాలకు ఆహారం ఇవ్వడం నిషేధం.

ఎవరైనా పావురాలకు ఆహారం ఇస్తూ పట్టుబడితే, వారు 500 డాల‌ర్లు జరిమానాగా చెల్లించాలి.పాటలు పాడితేసింగ‌పూర్‌లో బహిరంగ ప్రదేశాల్లో పాటలు పాడకూడ‌దు.

ఎవ‌రైనా బహిరంగ ప్రదేశంలో పాట పాడుతున్నట్లు పోలీసులు గ‌మినిస్తే వారికి మూడు నెలల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు.

తాజా వార్తలు