UK Student Visa : విద్యార్ధి వీసాపై బ్రిటన్ వెళ్తున్న భారత విద్యార్ధులు...వెళ్ళాక ఏం చేస్తున్నారో తెలుసా...!!

భారత్ నుంచీ ప్రతీ ఏటా ప్రపంచ నలుమూలలకు వెళ్లి చదువుకునేందుకు ఎంతో మంది విద్యార్ధులు వలసలు వెళ్తుంటారు.

ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు ఎక్కువగా విద్యార్ధులు మొగ్గు చూపుతుంటారు.

అయితే గతంలో అమెరికా కోవిడ్ ఆంక్షల కారణంగా ఆ దేశం వెళ్లి చదువుకోవడానికి వీలు లేని నేపధ్యంలో ఎంతో మంది భారత విద్యార్ధులు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూశారు.ఈ క్రమంలోనే బ్రిటన్, కెనడాకు భారత్ నుంచీ విద్యార్ధుల వలసలు క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చాయి.

అయితే బ్రిటన్ కు ఉన్నత చదువుల కోసం వెళ్తున్న విద్యార్ధులు అక్కడికి వెళ్ళాక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారట.భారత్ నుంచీ విద్యార్ధి వీసాపై వెళ్ళిన మన విద్యార్ధులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారట.

అక్కడితో ఆగకుండా వాళ్ళ వీసా కేటగిరిని కూడా మర్చుతున్నారని తెలుస్తోంది.ఈ పరిణామాలు వారి తల్లి తండ్రులకు ఆందోళన కలిగించినా విద్యార్ధులు మాత్రం పక్కా ప్లాన్డ్ గానే ఈ నిర్ణయం తీసుకుంటున్నారట.

Advertisement

ఎందుకంటే భారత్ లోని యువకులలో అపారమైన స్కిల్డ్ వర్క్స్ ఉన్నాయి.ఎన్నో రంగాలలో నైపుణ్యత ను సాధించిన వారు ఎక్కువగా ఉన్నారు.

ఈ క్రమంలో వారు అక్కడికి వెళ్ళాక నేరుగా వీసాలను మార్చుకుని తమ టాలెంట్ కి తగట్టుగా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారట.

ఇదే విషయాన్ని భారత్ లోని ఎడ్యుకేషన్ కన్సెల్టెంట్ సంస్థలు కూడా నిజమని చెప్తున్నాయి.బ్రిటన్ లో ఎన్నో రంగాలలో నిపుణుల కొరత ఉందని, భారత్ లోని విద్యార్ధులు ముందుగానే కొన్ని కోర్సులు పలు రంగాలలో శిక్షణను తీసుకుని కొంత కాలం పార్ట్ టైం ఉద్యోగాలు చేసిన తరువాత వీసాలు సాధించి స్టూడెంట్ గా బ్రిటన్ వెళ్లి అక్కడ స్కిల్డ్ వర్క్ కు మార్పు చేసుకుని ఉద్యోగాలు సాధిస్తున్నారు.అదే నేరుగా స్కిల్డ్ వర్క్ వీసా ద్వారా బ్రిటన్ వెళ్ళాలంటే చాలా కష్టతరం అవ్వడంతో ముందు స్టూడెంట్ వీసాలపై బ్రిటన్ వెళ్తున్నారని తెలుస్తోంది.

అయితే ఇలా వెళ్ళడం ఏం మాత్రం తప్పుకాదని, చట్టబద్దమైనదేనని అంటున్నారు నిపుణులు.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు