లెఫ్టినెంట్ ఇమ్మడి పవన్ కు ఘన సన్మానం

దేశ రక్షణలో మిలట్రీ పాత్ర అమోఘం.సరిహద్దు చొరబాట్లను నియంత్రించేది మిలట్రీనే.

ఆ వృత్తిని ఎంచుకోవడం అభినందనీయం.

-మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా:దేశ రక్షణలో మిలట్రీ పాత్ర ఆమోఘమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని ఎస్వి కళాశాల ఆడిటోరియంలో ఆదివారం దివంగత గుంటకండ్ల సావిత్రమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగుల సమక్షంలో లెఫ్టినెంట్ గా పదోన్నతి పొందిన తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి పవన్ కు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిలట్రీ సరిహద్దుల్లో కాపలాగా ఉండడంతోటే మనం ఇంతటి ప్రశాంత వాతావరణంలో జీవనాన్ని కొనసాగిస్తున్నామని,అటువంటి వృత్తిని ఎంచుకుని దేశరక్షణలో ముందుండి పోరాడిన గోపయ్య చారి,కల్నల్ సంతోష్ బాబుల అమరత్వం అజరమారమని కొనియాడారు.

మిలట్రీ వృత్తిని ఎంచుకున్న యువత వర్తమానానికి స్ఫూర్తినందించే విధంగా ఉండాలన్నారు.డి.కొత్తపల్లికి చెందిన పవన్ లెఫ్టినెంట్ గా పదోన్నతి పొందడం అభినందనీయమన్నారు.సరిహద్దుల్లో విదేశీ చొరబాట్లను నిర్ద్వంద్వంగా నిరోధించేది మిలట్రీ సైన్యమేనన్నారు.

Advertisement

అటువంటి వృత్తిలో రాణిస్తూ ఉన్నత స్థానానికి చేరుకోవడం అనిర్వచనీయమైన ఘట్టంగా అభివర్ణించారు.మిలట్రీలో చేరిన వారికి సహజంగానే ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న సంకల్పం ఉంటుందని,ఆ సంకల్పానికి తగినట్లుగానే అవకాశాలు ఉంటాయన్నారు.

అటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.సభ అనంతరం లెఫ్టినెంట్ ఇమ్మడి పవన్ ను పూలమాలలు,శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పెర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ,కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహిస్తాం : కలెక్టర్
Advertisement

Latest Suryapet News