నువ్వు అందుకు కూడా పనికిరావు... అవమానాలను బయటపెట్టిన శోభిత!

శోభిత ధూళిపాళ్ల ( Sobhita Dhulipala ) ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.

తెలుగమ్మాయి అయినటువంటి శోభిత బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా శోభిత త్వరలోనే అక్కినేని (Akkineni) ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే నాగచైతన్యతో ( Nagachaitanya) నిశ్చితార్థం ( Engagment ) చేసుకున్న ఈమె త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

Sobhita Shared Bitter Experience She Faced At The Beginning Of Her Career , Sobh

ఇక నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగిన తర్వాత శోభిత వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కెరియర్ మొదట్లో ఈమె ఎదుర్కొన్న అవమానాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టానని శోభిత తెలిపారు.

మోడల్ గా ఓ షాంపూ యాడ్ ఆడిషన్ కోసం వెళ్ళిన సమయంలో అక్కడ తనకు చాలా చేదు అనుభవం ఎదురైందని తెలిపారు.

Sobhita Shared Bitter Experience She Faced At The Beginning Of Her Career , Sobh
Advertisement
Sobhita Shared Bitter Experience She Faced At The Beginning Of Her Career , Sobh

నేను నల్లగా ఉండడంతో అక్కడ నన్ను చూసి నువ్వు మోడల్ ఏంటి కనీసం బ్యాక్ గ్రౌండ్ మోడల్ గా కూడా పనికిరావు అంటూ హేళన చేశారు.ఈ ఆడిషన్ తర్వాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా ఏడ్చానని శోభిత తెలిపారు.నెమ్మది నెమ్మదిగా ఈ విషయాలన్నీ పక్కనపెట్టి అందం అనేది మ్యాటర్ కాదని ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకోవాలని ఆడిషన్స్ కి వెళ్తూ ప్రయత్నాలు చేశానని తెలిపారు.

ఇలా బాలీవుడ్ సినిమా అవకాశం వచ్చిన తర్వాత ఏ షాంపూ కంపెనీ అయితే నన్ను ఆడిషన్స్ లో అవమానించి రిజెక్ట్ చేసిందో అదే షాంపూ కంపెనీ తన సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయాలని నన్ను సంప్రదించారు అంటూ ఈ సందర్భంగా శోభిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు