ప్రతి స్కూల్లో విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది పడకుండా … మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.దీనివల్ల స్కూళ్లల్లో డ్రాపవుట్స్ తగ్గి … నాణ్యమైన భోజనాన్ని పిల్లలు తింటారని మధ్యాహ్న భోజన పధకాన్ని ఏర్పాటు చేశారు.అయితే… స్థానికంగా వీటి నిర్వహణ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వలన చాలా చోట్ల నాణ్యత లోపం కనిపిస్తోంది.అయితే మహారాష్ట్రలో ఓ స్కూల్ లో జరిగిన సంఘటన గురించి తెలిస్తే మాత్రం ఒళ్ళు గగుర్పాటు వచ్చెయ్యడం ఖాయం.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి పరిశీలిస్తే…
నాందెడ్‌లోని గర్గావన్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో చనిపోయిన పాము కనిపించడంతో అక్కడ కలకలం రేగింది.గురువారం విద్యార్థులకు భోజనం వడ్డిస్తుండగా.
కిచిడీలో చనిపోయిన పాము ముక్కలు కనిపించాయి.దీంతో షాకైన సిబ్బంది పిల్లలను అప్రమత్తం చేశారు.
కిచిడీ తినొద్దని చెప్పి భోజనాలు ఆపేశారు.

ఈ సమాచారం అందుకున్న నాందేడ్ డీఈవో ప్రశాంత్ డిగ్రస్కార్ పాఠశాలకు చేరుకున్నారు.ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 80 మంది విద్యార్థులు చదువుతున్నారు.
కిచిడీలో చనిపోయిన పాము ఉన్నట్లు గుర్తించగానే విద్యార్థులను తినకుండా అడ్డుకున్నామని సిబ్బంది తెలిపారు.విద్యార్థులంతా క్షేమంగా ఉన్నారన్నారు.అయితే, ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.