మొన్నటి వరకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ని ఉద్దేశించి వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్ పై చంద్రబాబుతో పాటు , టీడీపీ నాయకులు పెద్ద హడావుడి చేశారు.నియోజకవర్గాలు, మండలాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టి, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ఇప్పటికి ఈ వ్యవహారాన్ని టీడీపీ వదిలిపెట్టకుండా ఎన్నికల వరకు ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్లి, రాజకీయంగా తమకు లబ్ధి కలిగేలా చేసుకోవడంతోపాటు, వైసీపీని ఇరుకున పెట్టాలని ముఖ్యంగా తమను అదేపనిగా విమర్శిస్తూ వస్తున్న మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారికి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తోంది.ఇదిలా ఉండగానే, జగన్ బంధువు, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు వైసీపీ కి చెందిన సుబ్రహ్మణ్యం గుప్తా అనే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బెదిరించడం, భౌతిక దాడులకు దిగడం వంటి వ్యవహారాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఆ తరువాత ఈ వ్యవహారం పై స్పందించిన మంత్రి బాలినేనిఇది తనకు సంబంధం లేదని, ప్రకటించడంతో పాటు, బాధితుడు సుబ్బారావు గుప్త తో కలిసి కేక్ కట్ చేసి వివాదానికి పులిస్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.అయితే టీడీపీ మాత్రం సుబ్బారావు గుప్తా పై జరిగిన దాడి మొత్తం ఆర్య వైశ్యుల పై జరిగిన దాడి గా అభివర్ణిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఆర్యవైశ్యుల ద్వారా చేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండడం వంటి వ్యవహారాలపై తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
సుబ్బారావు గుప్త ఓ కార్యక్రమంలో మాట్లాడిన మాటలకు తమ పార్టీలోని కొంత మంది కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నాయని , అందుకే వారు తొందర పడ్డారని, ఈ విషయం తనవరకు రావడంతో వెంటనే ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టించారని ఆ తర్వాత సుబ్బారావు తనతోనే ఉన్నాడని , అసలు టీడీపీ వాళ్ళకు బాధ ఏమిటి అని ? ఏం చేయాలో అర్థం కావడం లేదు.మమ్మల్ని అభాసుపాలు చేయాలని టీడీపీ నాయకులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ పనిగా పెట్టుకుని కుయుక్తులు పన్నుతున్నారు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఐదు సార్లు ఒంగోలు నుంచి శాసన సభ్యునిగా ఎన్నికయ్యాను అని, తన కారణంగా ఒక్క ఆర్య వైశ్యుడు అయినా బాధపడ్డాడ అని ఆయన ప్రశ్నించారు.వైఎస్ఆర్సిపీ లోనే కాదు , టీడీపీ, జనసేన లో ఉన్న వారిని అడుగుతున్న ఎవరైనా బాధపడి ఉంటే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి బాలినేని వ్యాఖ్యానించారు.