ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఒక్కరు కాదు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలను వారు టీడీపీ మీదే చేశారు.
వారు బాహాటంగానే టీడీపీ అధినేత పేరును ప్రస్తావించారు.మొన్న వరదలు వచ్చినపుడు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను వారు ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు.
గాల్లోనే వచ్చాడు.గాల్లోనే పోతాడని చంద్రబాబు నాయుడు తిరుపతి సభలో అన్నాడని వారు ఉటంకిస్తున్నారు.తెలుగు తమ్ముళ్లు మాత్రం చంద్రబాబు వేరే అర్థంలో అన్నాడని చెబుతున్నారు.2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఫ్యాన్ గాలిలో సీఎంగా గెలిచారని, 2024లో ఆయన గాలిలోనే ఓడిపోతారని చెప్పినట్లు వారు వివరిస్తున్నారు.వైసీపీ నాయకులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వారు అంటున్నారు.కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల కామెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యాయి.

జగన్ ను భౌతికంగా లేకుండా చూస్తున్నారని అంటున్నారు.ఇది వచ్చే ఎన్నికల్లో సింపతీ కోసమా లేక ఎలా అనేది? మాత్రం ప్రశ్నార్థకం.జగన్ ముఖ్యమంత్రి కాక ముందు పాదయాత్ర చేసే సమయంలో ఆయన మీద విశాఖ పట్నం ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగింది.టీడీపీ నాయకులే ఈ హత్యాయత్నం చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు.
ఆ ఘటన తర్వాత వైఎస్.జగన్ సీఎంగా అధికారం చేపట్టారు.
అయినా కానీ ఆ కేసు మాత్రం ఇప్పటికీ కొలిక్కి రాలేదు.జగన్ తండ్రయిన ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.
రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.వైఎస్ ను ప్రత్యర్థులే తుద ముట్టించారని కొంత మంది అంటుంటే కొంత మంది మాత్రం వాతావరణం బాగోలేక హెలికాప్టర్ ప్రమాదం సంభవించిందని చెబుతారు.
ఇప్పటి వరకూ ఈ విషయం పై కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు.