పవన్ కళ్యాణ్ మంచి మనస్సుకు నిదర్శనం ఇదే.. ఆ కమెడియన్ కోసం ఏకంగా ఇంత చేశారా?

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan kalyan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాల్లో యాక్టివ్ గా గడుపుతున్న విషయం తెలిసిందే.

మొన్నటి వరకు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా పాలిటిక్స్ పై శ్రద్ధ చూపిస్తున్నారు.ఇటీవల బ్రో సినిమా( Bro )తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.ఇకపోతే పవన్ కెరియర్ లో మోస్ట్ స్పెషల్ సినిమా అంటే మొదట ఖుషి సినిమా గుర్తుకు వస్తూ ఉంటుంది.

ఇది రీమేక్ సినిమా అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా చాలా ప్రత్యేకము అని చెప్పవచ్చు.ఈ సినిమా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.అయితే ఖుషి సినిమా( Kushi movie ) అంతటి విజయం సాధించడానికి గల కారణం ద‌ర్శ‌కుడు ఎస్.జె.సూర్య‌నే నట.ఇందులో క్రియేటివ్‌గా సాగే యాక్ష‌న్ సీక్వెన్సులు, యే మేరా జ‌హాన్ పాట ప‌వ‌న్ ఆలోచ‌న‌ల నుంచి పుట్టుకొచ్చిన‌వే అన్న సంగ‌తి తెలిసిందే.ఇది కూడా స్వ‌యంగా సూర్య‌నే వెల్ల‌డించాడు.

Advertisement

అయితే వీటితో పాటుగా మ‌రో స‌న్నివేశం ప‌వ‌న్ సెట్లో కూర్చుని అప్ప‌టిక‌ప్పుడు క్రియేట్ చేసిన విష‌యం ఇప్పుడు బ‌య‌టికి వ‌చ్చింది.

క్లైమాక్సులో గుడుంబా స‌త్తిని క‌లిసే ముందు ప‌వ‌న్ ( Pawan kalyan )ఒక కామెడీ ఫైట్ చేస్తాడు.అందులో క‌మెడియ‌న్ బ‌బ్లూ ( Comedian Babloo )కూడా చిన్న రోల్ చేశాడు.నిజానికి ఈ సీన్ ముందు స్క్రిప్టులో లేద‌ట‌.

కానీ బ‌బ్లూకు ఎలాగైనా ఈ సినిమాలో చిన్న పాత్ర ఇవ్వాల‌ని అనుకుని ప‌వ‌నే సెట్లో కూర్చుని ఆ సీన్ రాశాడ‌ట‌.ముందు బ‌బ్లూ కోసం సీన్ పెట్టాల‌ని ప‌వ‌న్ అంటే ఇక్క‌డ ఇరికించ‌డం సాధ్యం కాద‌ని అన్నాడట సూర్య‌.

కానీ ప‌వ‌న్ ఎలాగైనా అత‌ణ్ని పెట్టాల‌ని ఆలోచించి మ‌రుస‌టి రోజు షూటింగ్‌కు ర‌మ్మ‌ని బ‌బ్లూకు చెప్పాడ‌ట‌.అత‌ను వ‌చ్చే స‌మ‌యానికి సెట్లో కూర్చుని ప‌వ‌న్ ఈ సీన్ రాసి అప్ప‌టిక‌ప్పుడు షూట్ చేయించిన‌ట్లు బ‌బ్లూ ఇటీవల ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్ల‌డించాడు.

కీర్తి సురేష్ పెళ్లి చీర కోసం అన్ని గంటలు కష్టపడ్డారా.. ఆ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు