ఇలా అయితే అల వైకుంఠపురములో అట్టర్ ఫ్లాప్ ఖాయం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమా సాధించిన భారీ సక్సెస్‌తో ఇతర భాషల దర్శకనిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చకచకా జరుగుతున్నాయి.ఇక ఈ సినిమాలో యంగ్ హీరో శివ కార్తికేయన్ బన్నీ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న తమిళ తంబీలు చాలా నిరాశకు లోనయ్యారట.శివ కార్తికేయన్ ఫాంలో లేకపోవడం, వరుసగా ఫ్లాప్ చిత్రాలను తెరకెక్కిస్తుండటంతో, ఇప్పుడు ఇలాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీలో ఎందుకు నటిస్తున్నాడా అని వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Advertisement

శివ కార్తికేయన్ కాకుండా ఈ సినిమాను వేరే స్టార్ హీరోతో చేస్తే బాగుంటుందని ప్రేక్షకులు అంటున్నారు.గతంలోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రాన్ని తమిళంలో శింబు నటించగా అది అట్టర్ ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)
Advertisement

తాజా వార్తలు