చంద్రబాబు నిప్పు అందుకే బెయిల్ - ఆవునూరి దయాకర్ రావు

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిజం గెలిచి చంద్రబాబుకు బెయిల్ పట్ల సిరిసిల్ల తెలుగు తమ్ముళ్ల ఆనందోత్సవాలు.

నిజం గెలిచి చంద్రబాబు కు బెయిల్ వచ్చిందని సంకెళ్లతో చంద్రబాబును బంధించలేరని తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల ఇంఛార్జి ఆవునూరి దయాకర్ రావు అన్నారు.

మంగళవారం చంద్రబాబు నాయుడు కి మధ్యంతర బెయిల్ రావడం పట్ల సిరిసిల్ల పట్టణంలో స్థానిక అంబెడ్కర్ విగ్రహం వద్ద బాణాసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ తప్పు చేయని చంద్రబాబునాయుడు ని 53 రోజులు అక్రమంగా జైల్లో బంధించి వైసీపీ ఆనందించారని చంద్రబాబు నాయుడు తో రాజకీయ యుద్ధం చేయలేని పిరికి పందలు వైసిపి నాయకులు అని విమర్శించారు.

చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు రావడం చాలా సంతోషం అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తీగల శేఖర్ గౌడ్, పార్లమెంట్ ఉపాధ్యక్షులు మచ్చ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు దుమాల సత్యనారాయణ, మాలోత్ సూర్యనాయక్, ఎల్లారెడ్డి పేట అధ్యక్షుడు చేట్కూరి నారాయణ గౌడ్,గంబిరావుపేట అధ్యక్షుడు చెపూరి ప్రభాకర్, ముస్తాబాద్ అధ్యక్షుడు సుద్దాల దేవయ్య, వీర్నపెల్లి అధ్యక్షుడు పెడ్తనపెళ్లి రాములు,తంగళ్లపెళ్లి అధ్యక్షుడు కడారి రాంరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి,అబ్బానవేని ఆశయ్య,పయ్యావుల లక్ష్మణ్,బింగి వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Advertisement

Latest Rajanna Sircilla News