ఖరీదైన కారు కొన్న స్టార్ సింగర్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

బాలీవుడ్ సింగర్ సాకెత్‌ టండన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు అద్భుతంగా పాటలు పాడి మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు సాకెత్‌ టండన్‌.

అంతే కాకుండా బాలీవుడ్ లో ఎంతో మంది సింగర్లు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు సింగర్ సాకెత్‌ టండన్‌.ఇతను సింగర్ పరంపరను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

తన భార్యతో కలిసి పలు పాటలను కూడా ఆలపించాడు సాకెత్‌ టండన్‌.బేకయాలి, మేరె సోనెయా, పల్‌ పల్‌ దిల్‌కే పాస్‌, మహియా మజ్ను, ఇష్క్‌ మేన్‌ లాంటి ఎన్నో హిట్‌ సాంగ్స్‌తో అలరించాడు సాకెత్‌ టండన్‌.

ఇకపోతే ప్రస్తుతం సాకెత్‌ టండన్‌ బాలీవుడ్‌లో టాప్‌ సింగర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా సాకెత్‌ టండన్‌ ఒక కొత్త కారును కొనుగోలు చేసాడు.

Advertisement

కుటుంబ సమేతంగా షోరూమ్‌కు వెళ్లిన సాకెత్ మెర్సిడిస్‌ బెంజ్‌ కారు కొనుగోలు చేశాడు.ఆ తర్వాత ఫ్యామిలీతో కలిసి కొత్త కారు ముందు ఫొటోలకు పోజులిచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాకుండా సాకెత్‌ టండన్ అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

కొత్త మెర్సిడిస్‌ కారును మా ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తున్నాం.మాకు సపోర్ట్‌గా ఉంటూ మామీద ప్రేమ కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ ప్రేమానురాగాలు, ఆశీర్వాదాల వల్లే మేము ముందుకు సాగుతున్నాం అని రాసుకొచ్చాడు సాకెత్‌ టండన్‌.

ఈ వీడియోని చూసిన అభిమానులు, సెలబ్రిటీలు సాకెత్‌ టండన్‌.కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు