మూడు వారాలకు గాను సింగర్ దామిని రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.

ప్రస్తుతం ఏడవ సీజన్ ప్రసారం అవుతూ ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది ఇక మూడవ వారంలో భాగంగా ఈ కార్యక్రమం నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా మూడు వారాలను పూర్తి చేసుకున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం 3 వారాలలోనూ లేడీ కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వచ్చారు.మొదటివారం కిరణ్ రాథోడ్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగా రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయ్యారు.

ఇక మూడవ వారం దామిని( Damini ) హౌస్ నుంచి బయటకు వచ్చారు.

ఈవరకు నామినేషన్స్ లో ఉన్న వారిలో చివరిగా దామిని, శుభశ్రీ ఇద్దరు మిగిలిపోయారు.అయితే వీరిద్దరి ఫోటోలను ఒక షిప్పుపై అతికించినటువంటి నాగార్జున( Nagarjuna ) ఎవరి ఫోటో ఉన్నటువంటి షిప్ పేలుతుందో వారు ఎలిమినేట్ అంటూ చెప్పారు దామిని ఫోటో అతికించినటువంటి షిప్ పేలిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యారు ఇలా మూడో వారమే సింగర్ దామిని ఎలిమినేట్ కావడంతో ఆమె కాస్త ఎమోషనల్ అయ్యారు.నేను మరికొన్ని రోజులపాటు హౌస్ లో ఉంటాను అనుకున్నాను కానీ ఇలా మూడవ వారమే హౌస్ నుంచి బయటకు వస్తాను అని తాను అనుకోలేదు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

Advertisement

ఇక దామిని ఎలిమినేట్ కావడంతో ఈమె ఎలిమినేషన్ కి గల కారణాలు ఏంటి అని కొందరు ఆరా తీయగా మరికొందరు మూడు వారాలకు గాను దామిని ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్( Remuneration ) అందుకుంది అంటూ ఈమె రెమ్యూనరేషన్ గురించి చర్చలు జరుపుతున్నారు.అయితే సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్నటువంటి దామిని మూడు వారాలకు గాను ఆరు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని ఇందులో టాక్స్ లు ఇతరత అన్ని పోనూ ఐదు లక్షల రూపాయల వరకు ఆమెకి రెమ్యూనరేషన్ రూపంలో అందిందని తెలుస్తుంది.అయితే గత సీజన్లో కూడా ఎంతోమంది సింగర్స్ పాల్గొన్నారు.

చాలా సీజన్ల వరకు సింగర్స్ టాప్ ఫైవ్ వరకు వెళ్లడం రన్నర్ గా నిలవడం అలాగే విజేతలుగా కూడా గెలవడం జరిగింది కానీ ఈ సీజన్లో మాత్రమే ఒక సింగర్ మూడవ వారమే బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Advertisement

తాజా వార్తలు