ఈశ్వరన్ కేసులో కీలక పరిణామం .. సింగపూర్ వ్యాపారవేత్తపై అభియోగాలు

అవినీతి ఆరోపణల్లో జైలు శిక్షకు గురైన భారత సంతతికి చెందిన సింగపూర్ రాజకీయవేత్త , మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్( S Iswaran ) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థిరాస్థి వ్యాపారిపై అభియోగాలు నమోదు చేశారు.

ప్రైవేట్ వ్యక్తుల నుంచి అవార్డులు, రివార్డులు పొందడంలో ఈశ్వరన్‌కు సహకరించినందుకు గాను ఓంగ్ బెంగ్ సెంగ్ (78)పై( Ong Beng Seng ) అభియోగాలు నమోదు చేశారు.

కోర్టు పత్రాల ప్రకారం.డిసెంబర్ 2022లో ఈశ్వరన్‌కు ఓంగ్ సింగపూర్ నుంచి దోహా వరకు తన ప్రైవేట్ విమానంలో 7,700 అమెరికన్ డాలర్ల విలువైన విహారయాత్రను అందించాడు.అలాగే 4,738 సింగపూర్ డాలర్ల రుసుముతో దోహాలోని ఓ హోటల్‌‌లో రాత్రి బసను, దోహా నుంచి సింగపూర్ వరకు 5,700 డాలర్ల విలువైన బిజినెస్ క్లాస్ ఫ్లైట్‌ను ఈశ్వరన్ కోసం ఓంగ్ ఏర్పాటు చేశాడు.2022 నుంచి 2028 వరకు సింగపూర్ జీపీ- సింగపూర్ టూరిజం బోర్డు మధ్య జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్( Singapore Grand Prix ) ఒప్పందం గురించి ఈశ్వరన్‌కు తెలుసునని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.ఎఫ్1 స్టీరింగ్ కమిటీకి ఈశ్వరన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.ఫార్ములా వన్( Formula 1 ) రేస్ ప్రమోటర్‌గా ఉన్న ఓంగ్ .ఈశ్వరన్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు.

కాగా.బ్రిటన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు, మ్యూజిక్ కన్సర్ట్‌లు, సింగపూర్ ఫార్ములా వన్ గ్రాండ్ ప్రిక్స్ టికెట్‌లు సహా పలు వస్తువులను సింగపూర్ వ్యాపారవేత్త ఓంగ్ నుంచి ఈశ్వరన్ పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.సింగపూర్‌లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీకి( Peoples Action Party ) రాజీనామా చేసిన ఈశ్వరన్ జనవరి 16న రవాణా మంత్రి పదవితో పాటు తన పార్లమెంటరీ స్థానానికి కూడా రాజీనామా చేశారు.1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికై ఆయన 2006లో మంత్రిగా నియమితులయ్యారు.రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.

Advertisement

ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి ఏడేళ్లలో దాదాపు 4,03,300 సింగపూర్ డాలర్ల విలువైన బహుమతులు పొందినందుకు గాను హైకోర్ట్ ఈశ్వరన్‌కి 12 నెలల జైలుశిక్ష విధించింది.

చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు