తీవ్ర అల‌స‌ట క్ష‌ణాల్లో త‌గ్గాలా.. అయితే ఇలా చేయండి!

అల‌స‌ట‌.నేటి కాలంలో చాలా మందిని త‌ర‌చూ వేధించే స‌మ‌స్య ఇది.అతిగా ప‌ని చేసిన‌ప్పుడు శ‌రీరం, మ‌న‌సు అల‌సిపోయి అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.

కానీ, కొంద‌రు మాత్రం పెద్దగా ఏమీ శ్రమించకపోయినా అల‌స‌ట చెందుతుంటారు.

ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ర‌క్త‌హీన‌త‌, నిద్ర‌లేమి, ప‌లు ర‌కాల మందుల వాడ‌‌కం, ఒత్తిడి, ఆహార‌పు అల‌వాట్లు, స్మోకింగ్‌, మ‌ద్యం అల‌వాటు ఇలా ర‌కర‌కాల కార‌ణాల‌ వ‌ల్ల త‌ర‌చూ అల‌స‌ట‌కు గుర‌వుతుంటారు.

అయితే ఇలాంటి వారు కొన్ని చిట్కాలు పాటిస్తే.త్వ‌ర‌గా అల‌స‌ట నుంచి రిక‌వ‌ర్ అవుతారు.మ‌రి ఆ చిట్కాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

నేటి ఉరుకుల ప‌రుగుల జీవితంలో చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తున్నారు.కానీ, అల‌స‌ట‌కు దూరంగా ఉండాల‌న్నా.

Advertisement

రోజంతా యాక్టివ్‌గా ఉండాల‌న్నా బ్రేక్‌ఫాస్ట్ త‌ప్ప‌నిస‌రి.కాబ‌ట్టి, ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

అలాగే శ‌రీరం డీహైడ్రేషన్‌కు గురైన‌ప్పుడు త‌ర‌చూ అల‌సిపోతుంటారు.అంద‌వ‌ల్ల‌, ఎప్పుడు కూడా నీటిని అధికంగా తీసుకోవాలి.అప్పుడే అల‌స‌ట త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

ఇక ఫాస్ట్ ఫుడ్స్‌, ఆయిల్ ఫుడ్స్, వైట్ రైస్ వంటి వాటికి దూరంగా ఉండి.ప్రొటీన్లు, ఆకు కూరలు, గింజ ధాన్యాలు వంటివి ఎక్కువ తీసుకోవాలి.

దీని వ‌ల్ల అల‌స‌ట స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.అదేవిధంగా, చాలా మంది అల‌స‌టకు గురైన‌ప్పుడు టీ లేదా కాఫీ సేవిస్తుంటారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

కానీ, దీనిపై వ‌ల్ల స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది.కాబ‌ట్టి, ఆ స‌మ‌యంలో ఏదైనా పండ్ల ర‌సం తీసుకుంటే.

Advertisement

క్ష‌ణాల్లో అల‌స‌ట నుంచి రిక‌వ‌ర్ అవుతారు.ఇక అలసట అనేది మన మానసిక స్ధితి.

కాబ‌ట్టి, ఒత్తిడికి దూరంగా ఉండి ఎంత సంతోషంగా ఉంటే.అల‌స‌ట‌కు అంత దూరంగా ఉండొచ్చు.

మ‌రియు స్మోకింగ్‌, మ‌ద్యం అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి.

తాజా వార్తలు