మునుగోడు నిశ్శబ్ద రాజకీయాలు...!

నల్లగొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం( Munugode Assembly constituency )లో ఎన్నికల రాజకీయం సడిచప్పుడు లేకుండా సైలెంట్ గా నడుస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో ఎన్నికల ప్రచార హోరు పరుగులు పెడుతూ ఉంటే మునుగోడులో మాత్రం రాజకీయాల ప్రచార జోరు మొదలు కాలేదు.

కానీ,అన్ని పార్టీల్లో సైలెంట్ పాలిటిక్స్ హీట్ పుటిస్తున్నాయి.అంతర్గత గ్రూపు తగాదాలతో ఎవరు ఏ పార్టీలో ఉంటారో? ఎవరు జంప్ అవుతారో? అర్థం కాక ఆని పార్టీల నాయకులు తలలు పట్టుకుంటున్నారు.ఇతర ప్రాంతాలలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రజాక్షేత్రంలోకి దిగి తమ గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తుండగా మునుగోడులో మాత్రం అభ్యర్థులు స్తబ్దుగా ఉన్నారు.

రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Reddy ) బీజేపీ నుండి కాంగ్రెస్ లో చేరడం,కాంగ్రెస్ అభ్యర్ధిగా ప్రకటించడంతో కాంగ్రెస్ లో ఆశలు పెంచుకున్న చలమల్ల కృష్ణారెడ్డి రెబెల్ గా పోటీ చేస్తానని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.దీనితోచలమల్ల( Chalamalla Krishna Reddy )ను బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం పడింది.

చలమల్ల, పాల్వాయి,కమ్యూనిస్టులు రాజగోపాల్ రెడ్డికి ఎంత వరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకంగా మారింది.మునుగోడులో కాషాయ జెండా ఎగరవేయొచ్చని భావించిన బీజేపీకి రాజగోపాల్ రెడ్డి షాక్ ఇవ్వడంతో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేకుండా పోయింది.

Advertisement

బీజేపీ బరిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్,( jajula srinivas goud ) భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీజేపీ పార్టీ సినీయర్ నాయకులు,మునుగోడు నుంచి రెండు పర్యాయలు పోటీ చేసి ఓడిపోయిన గంగిడి మనోహర్ రెడ్డిల పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నా,చలమల్లను బీజేపీ అభ్యర్ధిగా పోటీలో నిలిపి రాజ్ గోపాల్ రెడ్డికి షాక్ ఇవ్వాలని బీజేపీ ప్రయత్నాలు షురూ చేసినట్లు సమాచారం.కానీ,ఇంకా ఎవరిని ఖరారు చేయడం లేదు.

ఇక బీఆర్ఎస్ పార్టీ రెండు నెలల ముందే తమ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించినా కూసుకుంట్ల ప్రచారంలో వెనుకపడ్డట్లు కనిపిస్తుంది.కేసీఅర్ షెడ్యూల్ ప్రకారం ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాటు చేసినా ప్రజలు పెద్దగా రాలేదు.

కూసుకుంట్ల కూడా ప్రజాక్షేత్రంలో అంతగా పర్యటించడం లేదు.ఆడపాదడపా ఇతర పార్టీల చోటమోటా నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నా,సొంత పార్టీ నేతల నుండి పూర్తి వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు చూడడం,ప్రజలు కూడాబీఆర్ఎస్( BRS ) పట్ల వ్యతిరేకతతో ఉండడంతో ప్రజలు చూడడంతో పాటు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి తిరిగి రావడంతో కూసుకుంట్లకు టెన్షన్ పట్టుకుంది.

అసమ్మతి నేతలు,కూసుకుంట్లను వ్యతిరేకించే నాయకులు త్వరలో కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొనున్నారనే ప్రచారం జరుగుతున్నా గులాబీ అధిష్టానం మాత్రం మునుగోడుపై ఫోకస్ పెట్టకపోవడం గమనార్హం.ఇక బహుజన వాదంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బీఎఎస్పీలో కూడా టిక్కెట్ కోసం రగడ మొదలైంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : పేదలపట్ల ఇలాంటి నీచమైన పని అవసరమా?

ఉప ఎన్నికల్లో పోటీ చేసిన శంకరా చారికి ఈ సారి టిక్కెట్ ఇవ్వొద్దని,అతనికి వ్యతిరేకంగా పెండెం ధనుంజయ్ నేత వర్గం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగింది.బీఎస్పీలో కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రచారం కనిపించడం లేదు.

Advertisement

దీనితో సుమారు 15 నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో దేశం నివ్వెరపోయేలా మారిన మునుగోడు పాలిటిక్స్ ఇప్పుడు మాత్రం సైలెన్స్ ను తలపిస్తుండడంతో నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

Latest Nalgonda News