పోలి స్వర్గం రోజు ఏ విధంగా దీపాలను వెలిగించాలో తెలుసా?

కార్తీక మాసం చివరి రోజు అమావాస్య రోజు పెద్ద ఎత్తున ఆ శివునికి అభిషేకాలు నిర్వహించి, రావిచెట్టుకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు.

కార్తీక మాసం నెల రోజులు దీపాలను వెలిగిస్తారు.

అయితే ఈ నెలలో చివరి రోజైన మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున దీపాలను అరటి దొప్పలతో పెట్టి నదులలో వదలడాన్ని పోలి స్వర్గం అని పిలుస్తారు.అయితే ఈసారి అమావాస్య సోమవారం వచ్చింది.

పాడ్యమి మంగళవారం రావడంతో పోలి దీపాలను ఎప్పుడు వెలిగించాలి అన్న సందిగ్ధంలో ఉన్నారు.అయితే ఈ పోలి దీపాలను మంగళవారం తెల్లవారు జామున వెలిగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.

మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు స్త్రీలు వేకువజామున నిద్రలేచి నదీ స్నానాలు ఆచరించి ఆ నదిలో ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి అరటి దొప్పల పై పెట్టీ నదులలో వదులుతారు.అదే విధంగా ఆ నది మాతకు పసుపు, కుంకుమ, పూలతో పూజిస్తారు.

Advertisement

పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకుని పోలి కథను వినాలి.పురాణాల ప్రకారం పోలి అనే మహిళకు కార్తీకమాసంలో దీపారాధన చేయకుండా ఉండటానికి జాగ్రత్త పడిన తన అత్త కుటిల బుద్ధితో దీప సామాగ్రిని దాచి ఉంచి తను మాత్రమే గుడికి వెళ్లి దీపాలు పెట్టేది.

కానీ పోలీ మాత్రం చెట్టు నుంచి పత్తిని తీసుకుని ఒత్తులు తయారు చేసుకునేది.అలాగే మజ్జిగ కవ్వానికి ఉన్న వెన్న ద్వారా దీపాలను వెలిగించి ఎవరికీ కనపడకుండా ఆ దీపం పై గంపను బోర్లించేది.

ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది.

ఇలా నెల మొత్తం గడిచిపోయాక చివరికి అమావాస్య రోజున కూడా పోలికి దీపాలు వెలిగించే అవకాశం లేకుండా ఇంటి పనులన్నీ తనకు చెప్పి అత్త గుడికి వెళ్లిపోయారు.ఈరోజు కూడా పోలి యథావిధిగా ఇంటి పనులన్నీ ముగించుకొని కార్తీక దీపాలను వెలిగించింది .ఎన్ని కష్టాలు అవాంతరాలు ఎదురైనా పోలి మాత్రం దీపాలు వెలిగించడంతో దేవతలు ఆనందపడి పోలిని స్వర్గానికి తీసుకువెళ్లడానికి స్వర్గ లోకం నుంచి దేవతలు వస్తారు.అందు కోసమే శుద్ధ పాడ్యమి రోజున పోలి స్వర్గం అనే పండుగను జరుపుకుంటారు.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్18, సోమవారం 2024

ఈరోజు ఎవరైతే 30 వత్తులను వెలిగించి నీటిలో వదులుతారో వారికి ఈ నెల మొత్తం దీపారాధన చేసినంత పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రగాఢ నమ్మకం.నదులు కాలువలు అందుబాటులో లేని వారు ఒక గిన్నెలో నీటిని పోసి తులసి కోట ముందు ఈ దీపాలను వెలిగించి గంగా దేవికి నమస్కరించడం ద్వారా పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు