కషాయం ఎక్కువగా తాగుతున్నారా.. జాగ్రత్త సుమీ..!

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.

మరికొంత మంది ఈ మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మరికొంత మంది కరోనా బారిన పడకుండా వంటింటి చిట్కాలను పాటిస్తున్నారు.

అయితే వంటింటి చిట్కాలలో చాలా మంది ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు కషాయం ఎక్కువగా తాగుతున్నారు.ఒకవేళ కరోనా వచ్చిన దాని బారి నుండి త్వరగా కోలుకోవడానికి చాలా మందికి సరైన అవగాహన లేకుండనే కషాయం చేసుకొని తాగుతున్నారు.

అయితే కషాయాన్ని ఎక్కువగా తీసుకోవడం వలన కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు తెలియజేశారు.కషాయం తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

Advertisement

ఏమైనా సమస్యలు ఉన్న వాటిని చెక్ పెట్టేస్తుంది.అయితే కషాయం మితంగా తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది ఘాటైన పదార్దాలతో కషాయాన్ని తయారు చేస్తున్నారు.వారు తాయారు చేసే కషాయంలో మిరియాలు, లవంగాలు, శొంఠి, దాల్చిన చెక్క లాంటి పదార్దాలను ఎక్కువ మొత్తంలో తీసుకోని కషాయాన్ని తయారు చేస్తున్నారు.

ఇలా తయారు చేసిన ద్రావణాన్ని ఎక్కువగా తాగడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ బారిన ఎక్కువగా పడుతున్నారు.

దీంతో వారికీ కడుపులో మంట, నొప్పితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయితే కొంత మంది కషాయం తాగిన వెంటనే రోగ నిరోధక శక్తి పెరుగుతుందనే అపోహలో ఉండటం వలనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.అంతేకాకుండా కషాయం అతిగా తాగడం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు