ప్రస్తుతం ఏ తెలుగు సినిమాలోనైనా కథ ఎలా ఉన్నా ఐటమ్ సాంగ్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే.లేకుంటే ఆడియన్స్ అంగీకరించే పరిస్థితి ఉండదు.
అయితే ప్రతి డైరెక్టర్ తమ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉన్నా సుకుమార్ సినిమాలోని ఐటమ్ సాంగ్ పై విడుదలకు ముందే పెద్ద ఎత్తున క్రేజ్ అనేది ఉంటుంది.అందుకే సుకుమార్ సినిమా విడుదల అవుతుంది అని తెలియగానే ఆడియన్స్ లో మొదలయ్యే మొదటి చర్చ ఐటమ్ సాంగ్ ఏమిటి, ఐటమ్ సాంగ్ లో ఎవరు కనిపించనున్నారనే విషయమే.
ఇది ఇప్పటికిప్పుడు మొదలైన చర్చ కాదు .ఇంతలా చర్చ జరగడానికి ఐటమ్ సాంగ్స్ విషయంలో సుకుమార్ తీసుకునే జాగ్రత్తలే కారణం.ఆ అంటే అమలాపురం దగ్గర నుండి నేటి రంగస్థలంలోని జిగేలు రాణి వరకు ప్రతి ఒక్క పాట సూపర్ హిట్ గా నిలిచింది.అయితే ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప అన్న విషయం మనకు తెలిసిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సినిమా వరుస అప్డేట్స్ తో అభిమానుల్లో అంచనాలను పెంచుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పుష్ప సినిమాలోని రకరకాల పాత్రలను విడుదల చేసి అభిమానుల అంచనాలను పెంచడమే కాదు, ఏ మాత్రం సినిమా కథ ఏంటో గెస్ చేయకుండా జాగ్రత్త పడుతూ వరుస సస్పెన్స్ ను అభిమానుల్లో పెంచుతున్నారు సుకుమార్.
అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు సుకుమార్ సినిమాలంటే ఐటమ్ సాంగ్ కి కేరాఫ్ అడ్రస్ కాబట్టి పుష్పలో ఎవరు ఐటమ్ సాంగ్ లో నటించనున్నారనే దానిపై సస్పెన్స్ వీడింది.ఐటమ్ సాంగ్ లో సమంతను సుకుమార్ ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
సమంత అంగీకరించడానికి ప్రధాన కారణం తన మొదటి ఐటమ్ సాంగ్ ఇది కావడమే.దీంతో తన మొదటి ఐటమ్ సాంగ్ సుకుమార్ సినిమాలో కావడం మరొక కారణమని సినీ వర్గాలలో చర్చ నడుస్తోంది.