డీజే టిల్లు 2 : అన్ని మారుతున్నాయి ఎందుకు?

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా వచ్చిన డీజే టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

డీజే టిల్లు సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది.

ముఖ్యంగా యూత్‌ ఆడియన్స్ ను డీజే టిల్లు కట్టి పడేశాడు.సిద్ధు బాడీ లాంగ్వేజ్ మరియు పాత్ర ల తీరు అన్ని కూడా సినిమా హిట్ అవ్వడం లో కీలక పాత్ర పోషించాయి.

అందుకే డీజే టిల్లు సినిమా ఇప్పుడు సీక్వెల్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.అయితే డీజే టిల్లు సీక్వెల్‌ ప్రకటించినప్పటి నుండి కూడా వార్తల్లో నిలుస్తుంది.

సినిమా సీక్వెల్‌ విషయంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ మాత్రమే కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు.దర్శకుడు ఇప్పటికే సీక్వెల్‌ నుండి తప్పుకున్నాడు.

Advertisement

మరో దర్శకుడిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు.అంతే కాకుండా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ వారు డీజే టిల్లు సినిమా ను నిర్మించిన విషయం తెల్సిందే.

కాని డీజే టిల్లు 2 సినిమా ను మాత్రం సదరు నిర్మాణ సంస్థ నిర్మించేందుకు ఆసక్తిగా లేనట్లుగా తెలుస్తోంది.సిద్ధు జొన్నలగడ్డ కు సంబంధించిన సన్నిహితులు ఈ సీక్వెల్‌ ను నిర్మించేందుకు ముందుకు వచ్చారట.

అంతే కాకుండా హీరోయిన్ విషయం లో కూడా మార్పు జరిగింది.

నేహా శర్మ ను కాకుండా ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్‌ లేదా శ్రీలీలా ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఆ ఇద్దరితో కూడా చర్చలు జరిగాయి అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.మొత్తానికి దర్శకుడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?

హీరోయిన్‌ నిర్మాణ సంస్థ ఇలా అంతా మారడం తో అసలు ఏం జరుగుతోంది.డీజే టిల్లు సినిమా ను ఎందుకు ఇంతలా మార్చుతున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

మరీ ఇన్ని మార్పులు జరిగితే మ్యాజిక్‌ రిపీట్ అయ్యేనా అనేది చూడాలి.

తాజా వార్తలు