మమ్మల్ని ఫాలో కండి అంటున్న సిద్ధరామయ్య!

కర్ణాటకలో సింగిల్గా అధికారంలోకి వచ్చిన కర్ణాటకా కాంగ్రెస్( Karnataka Congress ) దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఆత్మవిశ్వాసం పెరగడానికి కారణమయ్యింది మొత్తం 111 సీట్లు మ్యాజిక్ ఫిగర్ గా ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 135 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇక పూర్తిగా పాలన మీద దృష్టిపెట్టిన సిద్ధరామయ్య ప్రభుత్వం తాము ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుంది.

ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టిన సిద్ధరామయ్య ప్రభుత్వం జూలై ఒకటో తేదీ నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటుంది.ఇక మిగిలిన పథకాలను కూడా తొందర్లోనే అమలులోకి తీసుకొస్తామని తేదీలను కూడా ప్రకటిస్తుంది.

కర్ణాటక లో కాంగ్రెస్ ను గెలిపించిన సిద్ధరామయ్యకు( Siddaramaiah ) మహారాష్ట్రలోని కాంగ్రెస్ నాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఎన్సిపి నేతలు కూడా హాజరయ్యారు.

ఆవేదికపై మాట్లాడిన సిద్ధరామయ్య మహిళా సాధికారితే తమ లక్ష్యమని మహిళలకు అన్నీ రంగాలలోనూ ముందుకు వెళ్లే అవకాశం ఇస్తే ఆ దేశం పురోగతి చెందుతుంది అంటూ చెప్పుకొచ్చారు.మహారాష్ట్ర లో కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో( assembly elections ) కాంగ్రెస్ -ఎన్సీపీ సర్కార్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పిన సిద్ధరామయ్య, కర్ణాటకలో తాము అమలు చేసిన పథకాలను మహారాష్ట్రలో కూడా హామీలుగా ఇస్తే గెలుపు సులువుతుందంటూ హితబోధ చేశారు.

Advertisement

కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి ఆ పార్టీ ఇచ్చిన ఆ ఐదు హామీలే ముఖ్యమని చెబుతారు సామాన్య మధ్యతరగతి వర్గాలను, మహిళా ఓటర్లను టార్గెట్ చేసిన ఈ ఐదు పథకాల హామీల వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైందని వార్తలు వస్తున్న దరిమిలా అవే పథకాలను మిగిలిన రాష్ట్రాలలో కూడా అమలు చేయడం ద్వారా విజయం సాధించవచ్చు అంటూ గెలుపు సూత్రాలను సిద్ధరామయ్య ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది మరి కాంగ్రెస్ ఎన్సీపీ శ్రేణులు సిద్ధరామయ్య సూక్తులు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి .

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు