సిగ్గుగా లేదా అలా చేయడానికి... నటుడు అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్!

సాధారణంగా సినీ సెలబ్రిటీలు ఏదైనా కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేయడం కోసం,లేదంటే సినిమాల పరంగా కూడా కొన్నిసార్లు వారికి తెలియకుండానే పెద్ద ఎత్తున వివాదాలలో చిక్కుకుంటారు.

ఇలా వివాదాలలో చిక్కుకొని దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతూ కొన్నిసార్లు బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతూ ఉంటాయి.

ఇదివరకు ఇలాంటి ఇబ్బందులను ఎంతో మంది సెలబ్రిటీలకు ఎదురైంది.అయితే తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం ఈ విధమైనటువంటి ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు.

ఈయన చేసినటువంటి ఓ చిన్న పని కారణంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా దారుణంగా నటుడు అక్షయ్ కుమార్ ను ట్రోల్ చేస్తున్నారు.ఇంతకీ ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే.అక్షయ్ తన ఉత్తర అమెరికా టూర్‌ను ప్రమోట్ చేయడానికి ఒక వీడియోను పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో పాటు దిశా పటానీ, నోరా ఫతేహి, మౌని రాయ్, సోనమ్ బజ్వా కూడా ఉన్నారు.ఇక ఈ ప్రమోషన్ వీడియోలో భాగంగా వీరంతా గ్లోబుపై నడుస్తూ ఉన్నట్టు చూపించారు.

Advertisement

ఈ క్రమంలోనే నటుడు అక్షయ్ కుమార్ గ్లోబ్ పై నడుస్తూ ఏకంగా ఇండియా పై కాలు పెట్టినట్టు ఈ వీడియోలో ఉంది దీంతో ఈ విషయంపై ఇండియన్స్ అక్షయ్ కుమార్ ను భారీగా ట్రోల్ చేస్తున్నారు.ఓ ట్విటర్ యూజర్.ఓ కెనడియన్ నటుడు భారత మ్యాప్‌పై తిరుగుతూ భారతీయులను అవమానిస్తున్నారు.

ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం?మీరు చేసిన ఈ సిగ్గుమాలిని పనికి 150 కోట్ల మంది భారతీయులకు క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.మరికొందరు ఈ భారతదేశాన్ని కాస్త గౌరవించండి ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కూడా పెద్ద ఎత్తున ఈయనను ట్రోల్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మరి ఈ విషయంపై నటుడు అక్షయ్ కుమార్ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు