టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రభాస్, రాధాకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా ఈ ఏడాది జులైలో విడుదల కానుండగా ప్రభాస్ సలార్, ఆదిపురుష్ మూవీలతో పాటు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు.
సలార్ మూవీలో ప్రభాస్ కు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.
సినిమా విడుదలకు సంవత్సరం ఉన్నా కేజీఎఫ్ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ప్రభాస్ శృతిహాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా సలార్ కాగా శృతి హాసన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సలార్ మూవీ భారీ యాక్షన్ మూవీ అని అయితే తనకు మాత్రం మూవీలో ఎటువంటి యాక్షన్ సీన్స్ లేవని శృతిహాసన్ అన్నారు.

సలార్ మూవీ ఒక షెడ్యూల్ షూటింగ్ లో తాను పాల్గొన్నానని శృతిహాసన్ చెప్పారు.సలార్ మూవీలో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని శృతిహాసన్ అన్నారు.తొలిసారి ప్రభాస్ తో కలిసి నటిస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని.కొంతమంది హీరోలు నిరాడంబరంగా ఉంటున్నట్టు నటిస్తారని కానీ ప్రభాస్ సహజంగానే నిరాడంబరంగా ఉంటారని శృతిహాసన్ అన్నారు.
ప్రభాస్ గురించి శృతిహాసన్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ సెట్ లో ఉండే వారందరితో కలిసిపోతారని.
ప్రభాస్ తో కలిసి పని చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని శృతిహాసన్ తెలిపారు.గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమైన శృతి హాసన్ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు.
ఈ ఏడాది శృతి నటించిన క్రాక్ ఇప్పటికే విడుదల కాగా వకీల్ సాబ్ సమ్మర్ లో విడుదల కానుంది.