రికార్డ్ః మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచిన ఉప్పెన

సినిమా పరిశ్రమలో లాక్ డౌన్‌ కు ముందు లాక్ డౌన్ కు తర్వాత పరిస్థితులు లేదా కరోనాకు ముందు కరోనా తర్వాత పరిస్థితులు అన్నట్లుగా ఏర్పడింది.కరోనా కు ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ రావాలంటే కొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు.

 Mega Hero Vaishnav Tej Movie Uppena Get Rare Indian Record , After Corona, Lock-TeluguStop.com

కొన్ని థియేటర్లు పూర్తిగా మూత పడటంతో పాటు ఏకంగా కూల్చి వేసి ఫంక్షన్‌ హాల్స్ లేదా షాపింగ్‌ కాంప్లెక్స్ లు గా మార్చేశారు.అందుకే చాలా వరకు కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్లుగా పరిస్థితి ఉంది.

కరోనా ముందు వరకు వంద కోట్ల సినిమా అంటే చాలా మామూలు విషయం.కాని ఇప్పుడు వంద కోట్ల సినిమా అంటే చాలా గొప్ప విషయం.

ఎందుకంటే కరోనా భయంతో ప్రేక్షకులు కనీసం థియేటర్ల వైపు చూడాలంటే భయపడుతున్నారు.ఇలాంటి సమయంలో విడుదల అవ్వడమే గగనం అలాంటిది వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం అంటే అద్బుతమే అనుకుంటున్న సమయంలో మన ఉప్పెన సినిమా ఆ ఘనత దక్కించుకుంది.

వైష్ణవ్ తేజ్‌ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా సుకుమార్‌ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందిన ఉప్పెన సినిమా విజయాన్ని సొంతం చేసుకుంది.ఏకంగా 100 కోట్ల రూపాయల గ్రాస్ ను ఈ సినిమా దక్కించుకుంది.

ఇన్ని రోజులు వంద కోట్ల కు కాస్త దూరంలో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు వంద కోట్లను చేరింది.అద్బుతమైన ఈ రికార్డును దక్కించుకుని ఇండియా లోనే మొదటి సినిమా అన్నట్లుగా రికార్డు దక్కించుకుంది.

కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండియా వ్యాప్తంగా విడుదల అయిన అన్ని సినిమా ల్లో కేవలం ఉప్పెన మాత్రమే ఇప్పటి వరకు వంద కోట్లను దక్కించుకుంది.బాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో విడుదల అయిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్‌ అవ్వలేదు.

దాంతో ఉప్పెనకు అరుదైన రికార్డు దక్కింది.లాక్ డౌన్ తర్వాత ఇండియాలో మొదటి వంద కోట్ల సినిమా గా ఉప్పెన చరిత్రలో నిలిచి పోవడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube