క్రేజీ ఆఫర్ నుంచి తప్పుకున్న సమంత.. ఛాన్స్ కొట్టేసిన శృతిహాసన్?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్( Shruti Haasan ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో శృతిహాసన్ పేరు కూడా ఒకటి.

శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఆ సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

గత ఏడాది బాల‌కృష్ఱ‌, చిరంజీవి సినిమాల‌తో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు మ‌ళ్లీ నాని హీరోగా వ‌చ్చిన‌ హ‌య్ నాన్న, ప్ర‌భాస్ స‌లార్ సినిమాల‌లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమాల‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రోటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలిచి శృతి కేరీర్‌లోనే హ్యాట్రిక్ విజ‌యాలు సాధించి బెస్ట్ ఇయ‌ర్‌గా రికార్డులకెక్కింది.దీంతో ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది హీరోయిన్ శృతిహాసన్.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళితే.సమంత నటించాల్సిన ప్రాజెక్ట్‌ ఇప్పుడు ఆమె వశమైంది.

ఇంతకీ ఆ ప్రాజెక్ట్‌ ఏమిటంటే? ఎన్‌.మురారి రచించిన నవల అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్ దీనిని ఆధారంగా చేసుకొని మనసుని హత్తుకునే చిత్రాన్ని తెరకెక్కించాలని ఫిలిప్‌ జాన్‌ భావిస్తున్నారు.

చెన్నై స్టోరీ( hennai story ) గా ఇది ప్రేక్షకుల ముందుకురానుంది.ఇందులో కథానాయికగా సమంతను ఎంచుకున్నారు.ఇప్పటివరకు అది పట్టాలెక్కలేదు.

ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌లో తాజాగా నటి శ్రుతిహాసన్‌ భాగమయ్యారు.డైరెక్టర్‌కు ధన్యవాదాలు చెబుతూ ఆమె తాజాగా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

చెన్నైకి చెందిన నాకు.ఆ నగర వైవిధ్యం, ప్రత్యేకతను చూపించే కథలో భాగమయ్యే అవకాశం దక్కడం సంతోషంగా ఉంది అని తెలిపింది శృతిహాసన్.

Advertisement

తాజా వార్తలు