పవన్ కళ్యాణ్ వరుసగా మూడు చిత్రాలకు కమిట్ అయిన విషయం తెల్సిందే.ఇప్పటికే పింక్ రీమేక్ మొదలవ్వగా, క్రిష్ దర్శకత్వంలో మూవీ షూటింగ్‌లో త్వరలో పవన్ జాయిన్ అవ్వబోతున్నాడు.
మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28 చిత్రం రూపొందబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.గతంలో పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమా తీసిన విషయం తెలిసిందే.
ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ మొదటి సూపర్ హిట్‌ను దక్కించుకుంది.
ఆ సినిమా తర్వాత శృతి హాసన్ క్రేజ్ అమాతం పెరిగింది.తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించి మెప్పించిన శృతిహాసన్ ప్రస్తుతం క్రాక్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇప్పుడు పీకే 28 కోసం ఆమెను సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

తనకు గబ్బర్‌సింగ్ వంటి హిట్ ఇచ్చిన పవన్, హరీష్ శంకర్‌లతో మరోసారి వర్క్ చేసేందుకు వెంటనే ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.కోటి రూపాయల పారితోషికంతో హరీష్ శంకర్ ఆమెను దాదాపుగా ఓకే చేసినట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
పింక్ రీమేక్ పూర్తి అయిన తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.