శీనయ్యను కాపీ కొట్టిన ఆచార్య.. డౌటే అంటోన్న మెగా ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తరువాత నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో చిరు పూర్తిగా కొత్త గెటప్‌లో కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ పనులతో బిజీగా ఉండగా, చిరంజీవికి సంబంధించిన ఓ లుక్‌ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి ఇందులో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఆఇక ఈ సినిమాలో చిరు లుక్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో దీనిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ లుక్ దర్శకుడు వివి వినాయక్ హీరోగా మారి నటిస్తున్న శీనయ్య అనే సినిమాలోని లుక్‌కు చాలా దగ్గరగా ఉందని పలువురు అంటున్నారు.వినాయక్ హీరోగా చేస్తున్న శీనయ్య, చిరు కొత్త లుక్‌లను పక్కనబెట్టి చూస్తే ఈ సందేహం ఎవరికైనా వస్తుంది.

Advertisement

మరి శీనయ్య లుక్‌ను కాపీ కొట్టిన చిరు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సనిమాను రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు