ఆ హీరో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రద్ధా శ్రీనాథ్..?

జెర్సీ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు శ్రద్దా శ్రీనాథ్.

తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఎక్కువగా నటించిన శ్రద్దా శ్రీనాథ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

సాధారణంగా ఏ సెలబ్రిటీ పెళ్లి జరిగినా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతారనే సంగతి తెలిసిందే.వరుణ్ ధావన్ పెళ్లికి కూడా సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

వరుణ్ ధావన్ నటాషా దలాల్ ను పెళ్లి చేసుకోవడం గురించి శ్రద్ధా శ్రీనాథ్ భిన్నంగా స్పందించారు.తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ లో వరుణ్, నటాషా ఫోటోలను యాడ్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ మరో మంచి నటుడు దుమ్ములో పడిపోయాడని అన్నారు.

వెండితెరపై వరుణ్ ధావన్ ను మళ్లీ చూడలేకపోతున్నందుకు తనకు బాధగా ఉందని తెలిపారు.అతని భార్య, బంధువులు వరుణ్ ఇతర హీరోయిన్లతో నటించడానికి ఒప్పుకోకపోవచ్చని ఆమె అన్నారు.

Advertisement

ఇకపై వరుణ్ ధావన్ హీరో ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తాడేమోనని ఆమె అభిప్రాయపడ్డారు.వరుణ్ ధావన్ ఇకపై పర్సనల్ లైఫ్ ను, ప్రొఫెషనల్ లైఫ్ ను సమన్వయం చేసుకోవడం కోసం కష్టపడాల్సి వస్తుందని శ్రద్ధా శ్రీనాథ్ పేర్కొన్నారు.వరుణ్ ను తాను మిస్ అవుతున్నానని.

ఏది ఏమైనా కంగ్రాట్స్ వరుణ్ అంటూ ఆమె పోస్ట్ చేసారు.అయితే శ్రద్ధా శ్రీనాథ్ కామెంట్స్ గురించి భిన్నాభిపాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు నెటిజన్లు వరుణ్ భార్య నటాషా దలాల్ తో శ్రద్ధా శ్రీనాథ్ కు విభేదాలు ఉన్నాయని అందువల్లే ఆమె ఈ విధంగా కామెంట్లు చేసి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.మరి కొందరు మాత్రం ఇలాంటి ప్రశ్నలు సాధారణంగా హీరోయిన్లకు ఎదురవుతాయని పరోక్షంగా శ్రద్ధా శ్రీనాథ్ సెటైర్లు వేసిందని అభిప్రాయపడుతున్నారు.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు