ఫోటోటాక్: విప్పి చూపించినా చూడరాయే.. ఫీలవుతున్న బ్యూటీ

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశం వచ్చినప్పుడే దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.

హీరోయిన్‌గా అంచెలంచెలుగా ఎదిగి స్టార్ స్టేటస్ సంపాదించుకున్న వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు.అయితే కేవలం నటనతోనే కాకుండా అందాల ఆరబోతకు కూడా నేటి హీరోయిన్లు సై అంటూ తమ హాట్ హాట్ అందాలను కుర్రకారుకు ఎరగా వేస్తున్నారు.అయితే ఎన్ని అందాలు చూపించినా కొందరికి మాత్రం అదృష్టం అస్సలు ఉండదు.

ఇలాంటి వారిలో తెలుగు హీరోయిన్‌ శ్రద్ధా దాస్ కూడా ఒకరు.సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత కేవలం వ్యాంప్ పాత్రలకే పరిమితం అయ్యింది.ఆర్య-2 సినిమాలో అమ్మడు చేసిన వ్యాంప్ తరహా పాత్ర దగ్గర్నుండి ఆమెకు అదే తరహా పాత్రలు దక్కాయి.గుంటూరు టాకీస్‌లోనూ అలాంటి పాత్రే దక్కడంతో దొరికిన ప్రతి ఛాన్స్‌ను వాడేసుకుంది.

అయితే ఎన్ని చేసినా ఆమెకు హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు రాలేదు.తెలుగులో చాలా సినిమాలే చేసిన ఈ బ్యూటీకి తగిన గుర్తింపు మాత్రం లేదు.

దీంతో ఇతర భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ బ్యూటీ.అయితే అక్కడ కూడా అమ్మడికి దురదృష్టమే ఎదురైంది.

దీంతో దొరికిన సినిమా ఆఫర్లు చేస్తూనే సోషల్ మీడియా దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది.హాట్ హాట్ ఫోటోషూట్‌లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.

ఏకంగా బికినీ షోలతో తన నడుము సోయగాలను చూపిస్తూ నెటిజన్లకు వేడి పుట్టుస్తోంది.మరి ఈ అమ్మడు ఇంతలా అందాల ఆరబోత చేస్తున్నా కనీసం పిలిచి అవకాశం ఇచ్చే నాధుడే లేడా అంటున్నారు ఆమె అభిమానులు.

తాజా వార్తలు