అమెరికాలో మరోసారి కాల్పులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు..

అమెరికాలో తుపాకులు అంటే ఏదో ఆట బొమ్మల్లాగా మారిపోయాయి.ఎందుకంటే అమెరికాలో ఉండే చాలా మంది యువత దగ్గర తుపాకులు ఆట బొమ్మలా ఉన్నాయి.

వాటితో యువకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.ఇంకా చెప్పాలంటే అమెరికా వరుస కాల్పుల ఘటనలు కలకలం పెరుగుతున్నాయి.

కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

లాస్ ఏంజిల్స్ అతి సమీపంలో బెవర్లీ క్రెస్ట్‌ లో ఈ ఘటన చోటుచేసుకుంది.జన సమూహంలో కలిసిపోయిన దుండగుడు హఠాత్తుగా కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Advertisement

కాలిఫోర్నియాలో ఈ నెల లో కాల్పులు జరగడం ఇది నాలుగో సారి అని పోలీస్ అధికారులు వెల్లడించారు.లాస్‌ ఏంజిల్స్‌ సమీపంలో మాంటేరీ పార్క్‌లో ఈమధ్యలో కాల్పులు చోటుచేసుకున్నాయి.

చైనీయుల లూనార్‌ నూతన సంవత్సర వేడుకల్లో దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి పది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు.ఆ తర్వాత హాఫ్‌మూన్‌ బే ప్రాంతంలో రెండు చోట్ల దుండగులు కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.అంతే కాకుండా మరి కొంత మందికి గాయాలయ్యాయి.

ఇంకా చెప్పాలంటే చికాగో లో తెలుగు విద్యార్థుల పై నల్ల జాతీయులు కాల్పులు జరపడం బాధాకరం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ ఘటనలో హైదరాబాద్ కు చెందిన నందపు దేవ్‌శిష్‌ అనే విద్యార్థి మృతి చెందాడు.కొప్పాల సాయి చరణ్ కూడా గాయాల పాలయ్యాడు.విశాఖపట్ననికి చెందిన లక్ష్మణ్‌ కాల్పుల నుంచి తృటి లో తప్పించుకున్నాడు.

Advertisement

అమెరికాలోనీ లాస్ ఏంజిల్స్ లో వరుస ఘటనలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.దుండగుల పై పోలీసులు ఫోకస్ పెంచినట్లు సమాచారం.

దుండగులను వెంటనే పట్టుకోవాలని అత్యున్నత స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తాజా వార్తలు