టాయిలెట్స్ లో స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళకి షాకింగ్ న్యూస్

స్మార్ట్ ఫోన్ తిండి లేకపోయినా పరవాలేదు.చివరికి నీళ్ళు త్రాగాకపోయినా పరవాలేదు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే మాత్రం ఇప్పుడున్న ప్రపంచానికి పిచ్చి పట్టేస్తుంది.

ఫోన్ లో చిన్న ప్రాబ్లం వచ్చి ఒక గంట పనిచేయకపోతే ఎదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు యూజర్స్.రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్నా సరే చూపు సెల్స్ మీదనే ఉంటోంది.

ఎక్కడ పడితే అక్కడ వాడేస్తున్నారు.ఎంత దారుణం అంటే చివరికి టాయిలెట్స్ లో కూడా స్మార్ట్ ఫోన్ తమ వెంట తీసుకుని వెళ్తున్నారు.

అయితే స్మార్ట్ ఫోన్స్ ని టాయిలెట్స్ లో వినియోగించే వారికి ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ తెలుపుతున్నారు నిపుణులు.టాయిలెట్స్ లో స్మార్ట్ ఫోన్ వాడితే.

Advertisement

అనారోగ్య సమస్యలు తప్పవని తాజా పరిశోధనలో తేలింది.టాయ్‌లెట్‌లో స్మార్ట్ ఫోన్లను వాడటం ద్వారా డయేరియా, మూత్ర సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.

అంతేకాదు స్పెర్మ్ కౌంట్ స్థాయి కూడా తగ్గిపోతుందట.టాయ్‌లెట్‌లో ఉండే సింకులు ఇతరత్రా పింగాణీలపై ఇశ్చిరియా కొలై, క్లాస్ట్రీడియం డిఫిచిలే వంటి రోగాలు క‌లిగించే బాక్టీరియా ఉంటుందట.

మొబైల్ తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బేసిన్లని ముట్టుకున్న చేతులతో మొబైల్ పట్టుకోవడం వలన ఆ బాక్టీరియా ఫోన్ మీద‌కి చేరుకుంటుంది.అదేవిధంగా ఆ బ్యాక్టీరియా ఎదో రకంగా శరీరంలోకి ప్రవేశించి.

శరీరం లోపల వ్యవస్థ పై చేడుపరినామాలని చేస్తుంది అని తద్వారా అనేక రకాలైన జబ్బులు వస్తాయి అని లండన్ యూనివ‌ర్సిటీకి చెందిన డాక్ట‌ర్ పాల్ మెటెవాలే చెప్పారు.అంతేకాదు బయట తిరిగివచ్చినప్పుడు చాలా మంది బూట్లని నేరుగా ఇంట్లో విప్పుతూ ఉంటారు, అలాగే టివీ రిమోట్,కంప్యూటర్స్ ఇలాంటి వస్తువులని శుభ్రపరచకుండా వాడితే రోగాల బారిన పడకుండా ఉండటం కష్టం అని తెలిపారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
రథ సప్తమి ఎందుకు చేస్తారో తెలుసా?

రోజులో 24గంటలు సెల్ ఫోన్ పట్టుకునే ఉంటారు.కనీసం టాయిలెట్స్ కి వెళ్ళినప్పుడు అయినా సరే వాటిని దూరంగా ఉంచండి అని సూచిస్తున్నారు నిపుణులు .

Advertisement

తాజా వార్తలు