వలస రాజ్యానికి షాకింగ్ న్యూస్...అమెరికాను వీడుతున్న అమెరికన్స్...

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నిపుణులు వ్యాపార వేత్తలు, విద్యార్ధులు ఇలా అన్ని వర్గాల వారు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.

ఇలా అమెరికాకు వలసలు వెళ్లి స్థిరపడే వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.

అమెరికాలో లక్షలాది మంది భారతీయలు, ఇతర దేశాలకు చెందిన వారు ఎక్కువగా ఉంటారు.అంతేకాదు అక్కడి ప్రభుత్వ, ప్రవైటు రంగంలో భారతీయులు ఎంతో క్రియాశీలక పాత్ర కూడా పోషిస్తున్నారు.

ఏటా లక్షలాది మంది వలస వాసులు అమెరికాకు తరలి వెళ్తున్నారంటే అగ్ర రాజ్యానికి ఏ స్థాయిలో డిమాండ్ ఉందొ అర్థం చేసుకోవచ్చు.అయితే తాజాగా ఓ సర్వ్ వెల్లడించిన విషయాలు మాత్రం అందరిని షాక్ కి గురిచేస్తున్నాయి.

యావత్ ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూస్తుంటే అమెరికాలో కొందరు అమెరికన్స్ మాత్రం అమెరికాలో స్థిరపడేందుకు ఏం మాత్రం సిద్దంగా లేరట.అంతేకాదు పరాయి దేశాలవైపు చూస్తున్నారని ఇతరదేశాలలో స్థిరపడేందుకు అమెరికాను విడిచి పెట్టి వెళ్తున్నారని తెలుస్తోంది.

Advertisement

తమకు [ప్రశాంతమరైన జీవితం ఉండాలని, సంతోషంగా గడపాలని ఉందని అందుకు తమకు అనువైన దేశాలను ఎంచుకుంటున్నామని అమెరికా ధనవంతులు అంటున్నారట.ప్రపంచం మొత్తం అమెరికా వస్తుంటే అమెరికన్స్ మాత్రం వేరే దేశాలు వెళ్ళిపోవాలని అనుకోవడానికి రీజన్ లేకపోలేదట.

అమెరికాలో ఎన్నడూ లేనంతగా వాతావరం కాలుష్యం అవుతోందని, ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడటం లేదని, కరోనా తరువాత అమెరికా పూర్తి విభిన్నంగా మారిందని ఒక పక్క జాతి విద్వేషాలు, ప్రకృతి ప్రళయాలు, కరోనా తగ్గుముఖం పట్టలేకపోవడం, రాజకీయ అనిశ్చితి ఇలా ఒకటి కాదు రెండు ఎన్నో కారణాల వలన అమెరికాలోని ధనికులు అమెరికాను వీడెందుకు సిద్దపడుతున్నారట.ఇదిలాఉంటే గడిచిన మూడేళ్ళ కాలంలో అమెరికాను వీడిన వారి సంఖ్య 337 శాతం పెరిగిందని తెలుస్తోంది .

Advertisement

తాజా వార్తలు