బైక్ ఆపిన పోలీసులకు షాక్.. ఎందుకంటే

పోలీసులు ఎక్కడైనా వాహన తనిఖీలు చేయడం కామన్.ఇందులో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి, వాహనానికి సంబంధించి సరైన పేపర్స్ లేని వారికి ఫైన్ వేస్తుంటారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి సైతం జరిమానాలు వేస్తున్న వారిలో మార్పు రావడం లేదు.ప్రస్తుతం హైదరాబాద్‌లో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతుండటం, ఇందుకు డ్రంక్ అండ్ డ్రైవే ఎక్కువగా కారణం అవుతోంది.

తాజాగా ఒకే రోజులో డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.దీంతో పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు.

ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయడం పెంచారు.ఇదే క్రమంలో బైక్‌పై గతంలో ఎన్ని చలాన్లు పెండింగ్ లో ఉన్నాయనే విషయాన్ని సైతం చెక్ చేస్తున్నారు.

Advertisement

అయితే తాజాగా ఓ బైక్‌ను ఆపిన పోలీసులకు దిమ్మతిరిగింది.ఆ బైక్ పై ఉన్న చలాన్లను చూసి వారే ఆశ్చర్యానికి లోనయ్యారు.

అందులోంచి తేరుకునే లోపు సదురు బైక్‌ను నడిపిన వ్యక్తి అక్కడి నుంచి జంప్ అయ్యాడు.తాజాగా హైదరాబాద్‌లోని కాచిగూడ‌కు చెందిన ట్రాఫిక్ పోలీసులు అలీ‌కేఫ్ చౌరస్తా లో చెకింగ్ చేపట్టారు.

ఈ క్రమంలో ఓ బైక్ ను పట్టుకున్నారు.దాని పత్రాలు తదితర వివరాలు చెక్ చేస్తూ బైక్ పై ఉన్న పెండింగ్ చలానాలను సైతం చెక్ చేశారు.

చలాన్ల వివరాలు చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.విషయం ఏమిటంటే.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
గ్రహశకలాన్ని గుర్తించి అరుదైన ఘనత సాధించిన విద్యార్థి

ఆ బైక్ పై ఇప్పటి వరకు 179 చలాన్లకు సంబంధించి రూ.42,475 ఫైన్ రూపం లో పెండింగ్ ఉన్నాయి.ఇక ఆ బైక్ నడిపిన వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.

Advertisement

అతడు బైక్ ను అక్కడే వదిలి పారిపోయాడు.ఈ బైక్‌ను సీజ్ చేసిన పోలీసులు దానిని స్టేషన్ కు తరలించారు.

తాజా వార్తలు