ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో చెప్పల్స్‌ తయారు చేసింది.. వీటి ధర ఎంతో తెలిస్తే గుండె జారిపోవడం ఖాయం

తెలివి ఉండాలి కాని డబ్బు సంపాదించడం చాలా సులభం అంటూ ఆమద్య విడుదలైన ఒక తెలుగు సినిమాలో డైలాగ్‌ ఉంది.

కొందరు మాత్రం వంద రూపాయలు సంపాదించేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు చెమటోడ్చి మరీ కష్టపడతారు.

కాని కొందరు వేల రూపాయలు కూడా తెలివి ఉపయోగించి, ఇంట్లోనే కూర్చుని సంపాదిస్తూ ఉంటారు.తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళ చూపించిన తెలివికి ఎవరైనా మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే.

ఆమె ఆహా, ఓహో అన్నట్లుగా కష్టపడకుండా, సింపులగా వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌తో డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.న్యూజిలాండ్‌కు చెందిన ఒక మహిళ డూ ఇట్‌ యువర్‌ సెల్ఫ్‌ కార్యక్రమంలో భాగంగా వాడి పడేసిన ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను సేకరించి వాటిని చెప్పులుగా తయారు చేసింది.వాటిని కొందరికి ఫ్రీగా ఇవ్వడంతో పాటు, కొన్నింటిని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది.ఆన్‌ లైన్‌ లో ఈ చెప్పులను ఆమె 20 డాలర్లకు అంటే ఏకంగా 1400 రూపాయలకు ఆమె అమ్ముతానంటూ పెట్టింది.20 డాలర్లకు మంచి షూస్‌ వస్తాయి, మీ బాటిల్‌ చెప్పులు ఎందుకు కొనాలో చెప్పండి అంటూ ఆమెను కొందరు ప్రశ్నించిన సమయంలో ఆకట్టుకునే సమాధానం చెప్పింది.

Advertisement

మీరు అన్నది నిజమే 20 డాలర్లకు ఎన్నో మంచి కంపెనీల షూష్‌, చెప్పల్స్‌ వస్తాయి.కాని వాటిని వేసుకోవడం వల్ల మీరు ప్రత్యేకంగా ఏమీ ఉండరు.అందరిలో మీరు కూడా, కాని నేను తయారు చేసిన ఈ చెప్పులు వేసుకుంటే మీరు చాలా ప్రత్యేకంగా ఉంటారు, చాలా విభిన్నమైన వారిగా మిమ్మల్ని అంతా గుర్తిస్తారు.

అందుకే మీరు నా చెప్పులు తీసుకోండి అంటూ సలహా ఇచ్చింది.ఆమె సమాధానంతో కన్విన్స్‌ అయిన చాలా మంది ఆమె బాటిల్ చెప్పులను ఆర్డర్‌ చేస్తున్నారు.నీటిలో వెళ్లే సమయంలో ఈ చెప్పులు జారే అవకాశం ఉంది, తీసుకునే వారు కాస్త జాగ్రత్తగా నడిస్తే బెటర్‌.

ఇలాంటి చిత్ర విచిత్రమైన ఆలోచనలతో జనాలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూనే ఉంటారు.ఈ చిత్రమైన బాటిల్‌ చెప్పులను మీ స్నేహితులకు సజెస్‌ చేసేందుకు షేర్‌ చేయండి, వారి అభిప్రాయం ఏంటో తెలుసుకోండి.

ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !
Advertisement

తాజా వార్తలు