రెండు స్థానాల్లో షర్మిల పోటీ ? సికింద్రాబాద్ నుంచి విజయమ్మ ? 

పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్న వైఎస్ షర్మిల( YS Sharmila ) ఆ నియోజకవర్గంతో పాటు,  మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

మొన్నటి వరకు కాంగ్రెస్ తో పొత్తు కోసం ఆమె ప్రయత్నాలు చేశారు.

పొత్తు కుదిరే అవకాశం లేకపోవడంతో పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నించారు .కానీ ఆమెను తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ రాజకీయాలకే పరిమితం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు భావించారు.తెలంగాణ కాంగ్రెస్ ( Telangana Congress )నాయకులు నుంచి అధిష్టానానికి విజ్ఞప్తులు వెళ్లాయి .అయితే ఏపీ రాజకీయాల్లోకి తాను వెళ్లేది లేదని,  తెలంగాణలోనే ఉంటానంటూ పంతం పట్టడంతో,  షర్మిల పార్టీని విలీనం చేసుకునేందుకు ఆసక్తి చూపించలేదు .

ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడటంతో ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలని షర్మిల నిర్ణయించుకున్నారు.ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పోటీకి దించాలనే ప్లాన్ లో షర్మిల ఉన్నారు.ఈ మేరకు దరఖాస్తులకు ను ఆహ్వానిస్తున్నారు .ఇది ఇలా ఉంటే తాను పాలేరు నియోజకవర్గం నుంచే కాకుండా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.  రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్కచోట అయినా, గెలుపుకు డోకా ఉండదని లెక్కల్లో ఆమె ఉన్నారు.

  ఇది ఇలా ఉంటే షర్మిల తో పాటు ఆమె తల్లి విజయమ్మ ( Y.S.Vijayamma )కూడా రాబోయే ఎన్నికల్లో పోటీచేయాలని ఆలోచనతో ఉన్నారట.  ఈ మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపుకు ఢోకా ఉండదు అనే లెక్కల్లో ఉన్నారట.

Advertisement

ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లను షర్మిల ( YS Sharmila ) ఖరారు చేసినట్లు తెలుస్తోంది.సూర్యాపేట నుంచి పిట్టా రాంరెడ్డి, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతి కుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్ , గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి,  సిద్దిపేట నుంచి నరసింహ రెడ్డి,  సిరిసిల్ల నుంచి చొక్కాల రాము ,కామారెడ్డి నుంచి నీలం రమేష్  అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావు ల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు