షర్మిలమ్మా ..! ఇంత మోసం ఏంటమ్మా  ? 

అకస్మాత్తుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు.

అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

షర్మిల కోణంలో చూస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీని ఒంటరిగా ముందుకు తీసుకు వెళ్ళడం సాధ్యం కాదని , అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ప్రధాన పోటీ ఉన్న నేపథ్యంలో తమ పార్టీ తరపున అభ్యర్థులను పోటీకి దించినా,  అలాగే తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలవడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చిన షర్మిల పోటికి దూరంగా ఉన్నట్లుగా ప్రకటించి రాబోయే రోజుల్లో తన గౌరవానికి భంగం కలగకుండా ముందుగా జాగ్రత్త పడ్డారు .

Sharmilamma What Is The Fraud , Ysrtp,sharmila, Ys Sharmila, Ysrtp Leaders, Tele

కానీ ఆ పార్టీలోని నేతలు మాత్రం షర్మిల నిర్ణయం పై తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.ఈ నే పద్యంలోనే కొంతమంది పార్టీ నాయకులు షర్మిల కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.షర్మిల తమను మోసం చేసిందని , అసలు పార్టీ ఆమె ఎందుకు పెట్టారో చెప్పాలంటూ నిలదీశారు.

తమను వాడుకుని ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని నమ్మించి భారీగా సొమ్ములు పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేయించి ఇప్పుడు పోటీ చేయడం లేదని ప్రకటించి తమకు షాక్ ఇచ్చారని షర్మిల తీరుపై మండిపడుతున్నారు.మూడు రోజుల క్రిందట జరిగిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఉన్నత స్థాయి కార్యకర్తలకు సమావేశంలో 50 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దించాలని నిర్ణయించుకున్నట్లు షర్మిల ప్రకటించారు.

Sharmilamma What Is The Fraud , Ysrtp,sharmila, Ys Sharmila, Ysrtp Leaders, Tele
Advertisement
Sharmilamma What Is The Fraud , Ysrtp,sharmila, Ys Sharmila, Ysrtp Leaders, Tele

మొన్న జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయడం లేదనే విషయాన్ని ప్రకటించడం తో టిక్కెట్ల పై భారీగా ఆశలు పెట్టుకున్న నేతలు షర్మిల పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.షర్మిల డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ షర్మిల తమను మోసం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం కంటే దూరంగా ఉండటమే మంచిది అని షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నారట.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు