గ్రౌండ్ లో ఆ క్రికెటర్ చేసిన ఆ పనికి అవాక్కయిన నెటిజన్లు

క్రికెటర్ లు మ్యాచ్ అనంతరం చాలా కూల్ గా ఉంటారు.

అభిమానులతో సోషల్ మీడియా టచ్ లో ఉంటూ అప్పుడప్పుడూ రకరకాల విధాలుగా క్రికెట్ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తుంటారు.

అది కాక ఉత్కంఠ భరితంగా జరుగుతున్న మ్యాచ్ లో కొందరు క్రికెటర్ లు ప్రవర్తించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది.ఆ సమయంలో సదరు టీం అభిమానులకు కొంత ఆగ్రహం తెప్పించినా ఆ తరువాత ఆ ఘటన అభిమానులకు నవ్వులు పూయించడం ఖాయం.

ఇలా క్రికెట్ చరిత్రలో చాలా ఘటనలు జరుగుతాయి.సదరు క్రికెటర్ కూడా కావాలనీ చేయకున్నా ఆ సమయంలో అక్కడున్న పరిస్థితిని బట్టి అలా జరుగుతుంది.

అయితే తాజాగా జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్ లో పాక్ బౌలర్ ఉస్మాన్ ఖదీర్ వేసిన ఓ బంతిని దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ జార్జ్ లిండే లూజ్ బాల్ ను ఆసరాగా చేసుకొని లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టడానికి ప్రయత్నించాడు.కానీ అది సఫలం కాలేదు.

Advertisement

అయితే లిండే కొట్టిన బంతిని పట్టుకునేందుకు వెళ్ళిన సమయంలో షార్జిల్ ఖాన్ చేసిన ఓ పని ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికర సంఘటనగా మారింది.అయితే బంతిని సరిగ్గా అంచనా వేయలేక తన వెనకాల పడే బంతి కానీ అతను ముందుకు పరుగెత్తుకు వచ్చాడు.

బంతి కాస్తా షార్జిల్ ఖాన్ వెనకాల పడింది.ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు