ట్విట్టర్‌ను అనుసరిస్తున్న షేర్‌చాట్.. వెరిఫైడ్ అకౌంట్లకు ఛార్జీల వసూలు..

ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు.

ప్రపంచంలో ఏ మూలన ఏం జరుగుతుంది అనేది మొత్తం క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు.

ముఖ్యంగా ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ ఇలా రకరకాల సోషల్ మీడియా( Social media ) ప్లాట్‌ఫామ్స్‌లో అకౌంట్స్ ఓపెన్ చేసి నచ్చిన కంటెంట్ షేర్ చేస్తున్నారు యువత.అయితే ట్విట్టర్ లో సెలబ్రిటీల ఖాతాలకు మాత్రం బ్లూ టిక్ మార్క్ అనేది గతంలో ఉండేది.

బ్లూ టిక్ మార్క్ ద్వారా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వార్తా సంస్థలు, కంపెనీలు, బ్రాండ్స్ లాంటి ఇతర ప్రజా ప్రయోజనాల ఖాతాలను గుర్తించడం సులభంగా ఉంటుందని 2009లో బ్లూ టిక్ మార్క్ ప్రాసెస్ ని ప్రవేశపెట్టింది ట్విట్టర్.అయితే బ్లూ టిక్ మార్క్ వెరిఫికేషన్ కోసం కంపెనీ గతంలో ఎలాంటి డబ్బు వసూలు చేసేది కాదు.

ఎలాన్ మస్క్( Elon Musk ) ట్విట్టర్ సొంతం చేసుకున్న తర్వాత బ్లూ టిక్, గోల్డ్ టిక్, గ్రే టిక్ మార్క్స్ ని తీసుకొచ్చాడు.గ్రే టిక్ అనేది గవర్నమెంట్ కి సంబంధించిన ఖాతాల కోసం, గోల్డ్ టిక్ కంపెనీలకు ఇస్తున్నారు.ఇక ఆ టిక్ మార్క్స్ కోసం డబ్బును కూడా వసూలు చేస్తున్నారు.

Advertisement

బ్లూ టిక్ మార్క్( Blue tick ) కోసం ప్రపంచవ్యాప్తంగా నెలకు 7 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.iOS లేదా ఆండ్రాయిడ్‌లో ట్విట్టర్ ఖాతాను ఉపయోగించినట్లయితే నెలకు 11 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.ఇక ఇండియాలో iOS లేదా ఆండ్రాయిడ్ వాడేవారు ట్విటర్ బ్లూ టిక్ కోసం నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.ఇక వెబ్ క్లయింట్స్ 650 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.అంటే బ్లూ టిక్ కోసం ఏడాది కి దాదాపు రూ.6500 ప్లాన్ ని తీసుకోవాల్సి ఉంటుంది.ప్రస్తుతం షేర్ చాట్ కూడా ట్విట్టర్ బాటలోనే నడుస్తుంది.

ఇప్పటివరకు బ్లూ టిక్ మార్క్ అనేది కేవలం సెలబ్రిటీల అకౌంట్స్ కి మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు డబ్బులు కడితే ఎవరికైనా బ్లూ టిక్ వచ్చేస్తుంది.షేర్ చాట్ నెలకు బ్లూటిక్ కోసం రూ.297 రూపాయలు ఛార్జ్ చేస్తుంది. బ్లూ టిక్స్ డబ్బులకు అమ్ముకునే నిర్ణయం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు