రెస్టారెంట్‌ వెయిటర్‌కు రూ.7లక్షల టిప్.. ఎందుకో తెలిస్తే ఫిదా అవుతారు!

సాధారణంగా హోటల్ లేదా రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు వెయిటర్లకు టిప్పుగా కాస్త డబ్బు ఇస్తుంటారు కస్టమర్లు.

బిల్లు ఎంత అయిందో అందుకు తగ్గట్లుగా టిప్పు ఇచ్చి సర్వ్ చేసిన వారిని మెచ్చుకుంటారు.

అయితే మామూలుగా ఎవరైనా సరే వందల్లో, వేలల్లో టిప్పు ఇస్తారు.కానీ ఒక మహిళ తనకు ఆహారం వడ్డించిన ఒక వెయిటర్ కి ఏకంగా రూ.7 లక్షలు టిప్పు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఎవరామే? ఎందుకు లక్షల విలువైన టిప్పు ఇచ్చింది? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.విలియమ్స్‌ అనే మహిళ ఇటీవలే ఒక రెస్టారెంట్‌కి వెళ్లి అక్కడే ఫుడ్ తినేసింది.

జాస్మిన్ కాస్టిల్లో అనే వెయిటర్‌‌ విలియమ్స్‌కి ఆహారం వడ్డించింది.ఆ వెయిటర్‌ పనితీరుకి విలియమ్స్‌ ఫిదా అయిపోయింది.

దాంతో ఆమె భారీగా టిప్పు ఇచ్చింది.తిన్నఫుడ్‌కి గాను 30 డాలర్లు బిల్లు అయితే.

Advertisement

వెయిటర్‌కు టిప్పుగా 40 డాలర్లు ఇచ్చింది.అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3,000.అయితే విలియమ్స్‌ సర్వర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంది.

అందుకే ఆమె జీవితం గురించి ఆరా తీసింది.దానితో వెయిటర్ తన దీన గాధ గురించి వివరించింది.

తనకు ఒక చిన్న కూతురు ఉందని ఆమె ఆలనా పాలనా చూసుకోలేక జాబు మానేయాలని ఆలోచిస్తున్నట్లు చెప్పింది.దీంతో ఆమెకు మరింత సహాయం చేయాలని ఉంది విలియమ్స్‌.

వెంటనే ఆమె బ్యాంకు వివరాలు తీసుకొని క్యాష్ అనే ఒక యాప్‌ని ఓపెన్ చేసి ఆమె కష్టాల గురించి ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే ఫేస్‌బుక్‌ యూజర్లు తమకు తోచిన డబ్బును జాస్మిన్ కాస్టిల్లో బ్యాంకు అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు.అలా ఒక గంట వ్యవధిలోనే ఆమె అకౌంట్లో దాదాపు ఏడు లక్షల రూపాయలు వచ్చి పడ్డాయి.ఈ విషయాన్ని గుర్తించిన ఆ వెయిటర్ ఒక్కసారిగా సంతోషం లో మునిగి తేలింది.

Advertisement

ఒక అపరిచిత వ్యక్తి వచ్చి తనకు ఈ స్థాయిలో డబ్బు సాయం చేస్తుందని ఆమె ఊహించలేదు.పీకల్లోతు కష్టాల్లో ఉన్న తనకు ఎంతగానో సహాయం చేసిన విలియమ్స్‌కి ఆమె మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది.

అలాగే తనకి సహాయం చేసిన ఫేస్‌బుక్‌ యూజర్లకు కూడా ధన్యవాదాలు తెలిపింది.ప్రస్తుతం ఈ సంఘటన గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయింది.

తాజా వార్తలు