అప్పట్లోనే ఛాన్స్ ఇచ్చి గెస్ట్ హౌస్ కి రమ్మన్నారు.. నటి ప్రమీల రాణి కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనే సంగతి మనకు తెలిసిందే అయితే ఎన్నో సినిమాలలో నటిగా కీలక పాత్రలలో నటించి మెప్పించినటువంటి వారిలో ప్రమీల రాణి (Pramila Rani) ఒకరు.

తాజాగా ఈమె కూడా కాస్టింగ్ కౌచ్ (Casting Couch) గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈమె పేరు చెబితే గుర్తుపట్టలేరు కానీ చూస్తే మాత్రం గుర్తుపడతారు.ఈమె వెండితెరపై అలాగే బుల్లితెరపై ఎన్నో సినిమాలలోను నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

విక్రమార్క, వేదం, బాహుబలి, వకీల్ సాబ్ ఇలా 85 వరకు సినిమాల్లో నటించారు.ఇలా 8 పదుల వయసులో కూడా పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Senior Actor Pramila Rani Shocking Comments About Casting Couch Details, Casting

ఎంతో ధనవంతుల కుటుంబంలో పుట్టినటువంటి ఈమెకు 14 సంవత్సరాలకి పెళ్లి చేశారు.అయితే ఈమెకు అనారోగ్యం చేయడంతో డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పడంతో తన మొదటి భర్త తనని వదిలేసి వెళ్లిపోయారట ఈ క్రమంలోని 23 సంవత్సరాల వయసులో ఈమెకు రెండవ వివాహం చేశారు.రెండవ పెళ్లి( Second Marriage ) చేసుకున్న తర్వాత తనకు బాబు పుట్టారని అయితే బాబు పుట్టిన కొద్ది రోజులకే తన భర్త చనిపోవడంతో ఈమె నాటకాలు సినిమాలపై ఆసక్తి చూపించారు.

Advertisement
Senior Actor Pramila Rani Shocking Comments About Casting Couch Details, Casting

అదే సమయంలోనే బుల్లితెరపై మనసు మమత, భార్యా మణి వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Senior Actor Pramila Rani Shocking Comments About Casting Couch Details, Casting

ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు జరిగినటువంటి ఒక చేదు అనుభవం గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.తనకు ఎలాంటి తోడు లేకపోయినా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని నటిస్తున్నాను అయితే ఒకానొక సందర్భంలో కొందరు తనకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి గెస్ట్ హౌస్ కి( Guest House ) రమ్మన్నారంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇలా వారి వ్యవహార శైలి ప్రవర్తన తీరు నచ్చకపోవడంతో నేను ఆ సినిమాని వదిలేసుకున్నానని ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎనిమిది పదుల వయసులో ఉన్నటువంటి ప్రమీల రాణి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు