బిగ్ బాస్ ఫ్యాన్స్ కు శుభవార్త.. కంటెస్టెంట్ గా స్టార్ హీరోయిన్..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

సినిమా ఆఫర్లు తగ్గిన వాళ్లు, ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకోవాలని భావించే వాళ్లు ఎక్కువగా బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపుతారు.

తెలుగులో జులై లేదా ఆగష్టు నెల నుంచి బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తుండటం గమనార్హం.హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 14 సీజన్లు పూర్తి కాగా 15వ సీజన్ త్వరలో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి.

అయితే బిగ్ బాస్ సీజన్ 15లో కంటెస్టెంట్ గా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ భూమిక పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న భూమికా చావ్లాకు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గాయి.

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న భూమిక సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పేరును తెచ్చిపెట్టే రోల్స్ ను ఎక్కువగా ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.

Advertisement

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భూమికా చావ్లా ఈ మధ్య కాలంలో ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటోలను షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భూమిక మళ్లీ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.అయితే హిందీ బిగ్ బాస్ షోలో భూమిక పాల్గొనబోతున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హిందీలో బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తుండగా త్వరలో బిగ్ బాస్ సీజన్ 15 ప్రారంభం కానుంది.బిగ్ బాస్ సీజన్ 15లో భూమిక పాల్గొంటే మాత్రం హిందీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు సైతం బిగ్ బాస్ షోపై ఆసక్తి చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.భూమికకు సంబంధించి జరుగుతున్న ప్రచారం నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు