1.కేసీఆర్ పై వైఎస్ షర్మిల షర్మిల సంచలన ట్వీట్
తలపున సముద్రమున్నా చాప దుపకేసినట్టు వాక్సిన్ ల తయారీ సంస్థ గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకడం లేదా ? అంటూ కేసీఆర్ పై షర్మిల సంచలన ట్వీట్ చేశారు.
2.జూన్ 8న తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ సమావేశం జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనుంది.సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయే సమావేశం కరోన పరిస్థితులపై చర్చించనున్నారు.
3.ఆన్లైన్ జాబ్ మేళా
హైదరాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 7న ncs పోర్టల్ ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మైత్రి ప్రియ తెలిపారు .మరిన్ని వివరాలకు 8247656356 నంబర్ ను సంప్రదించాలని కోరారు.
4.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణవ్యాప్తంగా కొత్తగా 2,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
5.బ్లాక్ ఫంగస్ కేసులు తగ్గుముఖం
తెలంగాణలో గతంతో పోలిస్తే బ్లాక్ కాంగ్రెస్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తోంది.గత వారం పది రోజులుగా లతో పోలిస్తే ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గినట్లు వైద్య అధికారులు తెలిపారు.
6.స్పీకర్ అపాయింట్మెంట్ కోరిన ఈటెల
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన రాజీనామా లేఖను శాసనసభ స్పీకర్ కు వ్యక్తిగతంగా చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు.
7.ఏపీ డి సి ఎల్ సీఎండీగా రాజా బాపయ్య
విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ( ఈపీడీసీఎల్ ) చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా రాజాబాపయ్య కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.
8.గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లు
ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థలో ఐదవ తరగతి విద్యార్థుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
9.బ్లాక్ ఫంగస్
కర్ణాటకలో 1784 మందికి బ్లాక్ కాంగ్రెస్ సోకిందని వీటిలో 62 మంది కోలుకుంటున్నారని మిగిలిన వారు చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
10.టిడిపి నేత సోమిరెడ్డి పై కేసు నమోదు
టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై కేసు నమోదైంది.సెస్రిత టెక్నాలజీ ఎండి నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
11.సంగం డైరీ పాలకవర్గం పై కేసు నమోదు
సంగం డైరీ పాలకవర్గం పై కేసు నమోదు అయింది కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా పాలకవర్గ సమావేశం నిర్వహించారని ఎస్సై కిషోర్ ఫిర్యాదు చేశారు.
12.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,14,460 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
13.రేపు ఢిల్లీకి జగన్
ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
14.అందుబాటులోకి రానున్న బ్లాక్ ఫంగస్ మందులు
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడం వర్షం కొరత ఎక్కువగా ఉండటంతో 5 ఫార్మా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.అంతే కాదు ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు పై ఆంక్షలు విధించింది.
15.ఏపీ లో కరోనా
గడచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కొత్తగా 10,373 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.హరీష్ రావు వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఆగ్రహం
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హరీష్ రావు సరైన అవగాహన లేకుండా మాట్లాడారు అంటూ ఆయన మండిపడ్డారు.
17.ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ అస్వస్థతకు గురయ్యారు కొంత కాలంగా ఆయన అస్వస్థతతో బాధ పడుతున్నారు ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ ఆదివారం ఆయనను ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తరలించారు.
18.డల్లాస్ లో ‘ టి ప్యాడ్ ‘ వన భోజనాలు
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ వనభోజనాలు నిర్వహించింది.
19.రాష్ట్రాలకు ఇరవై నాలుగు కోట్లకు పైగా టీకాలు
రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63 కోట్లకు పైగా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది.కేంద్రం ఇప్పటి వరకు ఉచితంగా ప్రత్యక్షంగా సేకరించి రాష్ట్రాలకు ఇరవై నాలుగు కోట్లకు పైగా మోతాదులు సరఫరా చేసినట్లు పేర్కొంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,310 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,310
.