సీజ్ చేసిన వాహనదారులకు గుడ్ న్యూస్....డబ్బులు కట్టకుండానే....

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.

అయితే ఇలా కట్టడం నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై సంచరించినందుకుగానూ ప్రభుత్వ అధికారులు ద్విచక్ర వాహనాలు, కార్లు తదితర వాహనాలను సీజ్ చేశారు.

ఈ క్రమంలో కొంత మందికి అపరాధ రుసుం విధించగా మరి కొంతమంది వాహనాలను మాత్రం సీజన్ సంబంధిత పోలీస్ స్టేషన్లలో అప్పగించారు.అయితే గత కొద్ది కాలంగా సీజ్ చేసినటువంటి వాహనాలు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఉండిపోయాయి.

దీంతో తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికారులు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా సీజ్ చేసిన వాహనాలను వాహన యజమానులు సరైన పత్రాలను చూపించి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.అయితే ఇందుకుగాను వాహన యజమానులు చేయాల్సిందల్లా మరోమారు ఇలాంటి తప్పిదం చేయమని హామీ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

అలాగే ఎటువంటి అపరాధ రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు.దీంతో సీజ్ చేసిన వాహన యజమానులు తమ వాహనాలను తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లాక్ డౌన్ లో సడలింపులు చేపట్టడంతో రోజు రోజుకి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని కాబట్టి మరి కొంత కాలం పాటు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు