ఏపీ స్పీకర్‌కు సెగ.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనా.. !

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రస్తుతం రాజకీయాల్లో లేరని చెప్పాలి.రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందున ఆయన రాజకీయాలకు కాస్త దూరంగానే ఉండాలి.

కానీ, ఆయన వ్యవహార శైలి అలా కనబడదు.ఇంకా తాను వైసీపీ నేతనే అన్నట్లు స్పీకర్ ప్రవర్తిస్తుంటారు.

గతంలో తాను టీడీపీపైన విమర్శలకు కూడా చేశారు.ఈ సంగతులు అలా ఉంచితే.

తమ్మినేని సీతారాంకు ఇంటా బయటా రెండింటా సెగ తగల బోతున్నదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు కొందరు.స్పీకర్ గా ఉండి రాజకీయంగా దూకుడుగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు.

Advertisement

ఆయన స్పీకర్ పదవిలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా మంత్రి పదవిపైనే ఉందట.అందుకే ఆయన అలా ప్రవర్తిస్తున్నారనే చర్చ ఉంది.

ఇకపోతే ఆయన సొంత నియోకవర్గం పైన ఆయన కాన్సంట్రేట్ చేయడం లేదని టాక్.తమ్మినేని సీతారాం ఒకవేళ స్పీకర్ పదవిలో లేకపోతే కనుక కచ్చితంగా ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చి నిధులు తెచ్చేవారని, కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలోనే టీడీపీ నియోజకవర్గంలో బలోపేతమవుతున్నదని తెలుస్తోంది.

స్పీకర్ నియోజక వర్గం అయిన ఆముదాల వలస లో అభివృద్ధి కుంటు పడిందని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.పరిస్థితులు ఇలానే కొనసాగితే. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గ ప్రజలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకు సరైన గుణపాఠం చెప్తారనే చర్చ ఉంది.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ్మినేని సీతారాం కేవల 13,000 వేల ఓట్ల తేడాతోనే గెలుపొందారు.ఇకపోతే ఆయనకు అనూహ్యంగా స్పీకర్ పదవి లభించింది.ఇకపోతే ఒకవేళ ఆయన కనుక నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపైన కనుక ఫోకస్ పెట్టకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యే చాన్సెస్ తప్పక ఉంటాయని ఈ సందర్భంగా పలువురు హెచ్చరిస్తున్నారు.

Advertisement

మరో వైపున క్షేత్రస్థాయిలో తమ్మినేని సీతారాంకు పోటీగా ప్రతిపక్ష పార్టీలు బలోపేతమవుతున్నాయని అంటున్నారు.చూడాలి మరి.ఏం జరుగుతుందో వచ్చే ఎన్నికల్లో.

తాజా వార్తలు