తెలంగాణలో నేడు ఎన్నికల నామినేషన్ల పరిశీలన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది.ఈ మేరకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.

ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఒక్కో అభ్యర్థి రెండు, మూడు నామినేషన్లను దాఖలు చేశారు.

ఈ క్రమంలో పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైతే స్వతంత్ర అభ్యర్థిగా నిలిచేందుకు ముందస్తుగా కొందరు నామినేషన్లు వేశారు.ఈ నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు.

ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు గానూ ఈసీ అబ్జర్వర్లను నియమించింది.ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించింది.

Advertisement

వీరిలో 67 మంది సాధారణ పరిశీలకులుగా నియామకం కాగా 39 మంది ఐపీఎస్ అధికారులు పోలీస్ పరిశీలకులుగా బాధ్యతలు చేపట్టారు.మరో 60 మంది ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎన్నికల సంఘం.

ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 166 మంది అబ్జర్వర్లు వివిధ జిల్లాల్లో నామినేషన్లను పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు