వైరల్: హైటెన్షన్ వైర్లమధ్య స్కూటర్.. ఎలా ఇరుక్కుందబ్బా?

సోషల్ మీడియా జనాల్లోకి వచ్చాక ఎక్కడలేని వీడియోలు మనకు దర్శనమిస్తూ వస్తున్నాయి.ఒక్కో వీడియోని చూసినపుడు అసలు ఇదెలా సాధ్యం అని అనిపించక తప్పదు.

తాజాగా ఆ కోవకు చెందిన వీడియో ఒకటి జనాలను తెగ ఆకర్షిస్తోంది.ఇంకా చెప్పాలంటే ఆ వీడియోలో దృశ్యాన్ని చూసిన వారు ఇదెలా జరిగింది అని నోళ్లెళ్లబెడుతున్న పరిస్థితి.

విషయం ఏమంటే ఓ స్కూటర్ ( Scooter ) హైటెన్షన్ వైర్ల( Hi-Tension Wires ) మధ్య ఇరుక్కుంది.అదేదో గాల్లో ఎగిరి అక్కడికి వెళ్ళనట్టు అనిపిస్తుంది.

అయితే అంత భయానక యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు అక్కడ కనబడడంలేదు.పోనీ ఏదన్నా అలాంటిది జరిగితే ఆ స్కూటర్ తునాతునకలయ్యే ప్రమాదం లేకపోలేదు.

Advertisement

అయితే కొంతమంది జూన్ 18న తుపాన్( Toofan ) కార‌ణంగా స్కూట‌ర్ ఆ వైర్ల‌లో చిక్కుకుంద‌ని ఊహాగానాలు చేస్తున్నారు.కానీ ఏది ఏమైనా అంత ఎత్తులోకి స్కూటర్ ఎలా చేరిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.కానీ, ఇంటర్‌నెట్‌ వినియోగదారులు మాత్రం రకా రకాల మీమ్స్‌తో పిచ్చేకిస్తున్నారు.

సంఘటన స్థలంలో చాలా మంది ప్రజలు గుమిగూడి స్కూటర్‌ని చూస్తూ వీడియోలు తీస్తుండడం ఇక్కడ గమనించవచ్చు.ప్రాణాంతకమైన ఫుడ్ కాంబోలు, డ్యాన్స్ రీల్స్ వంటివి మిలియన్ల కొద్దీ వైరల్ వీడియోలు మనం చూసుంటాం గాని ఇలాంటి వింత వీడియో ఎప్పుడు చూడలేదు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక స్కూటర్ విద్యుత్‌ స్తంభం అంత ఎత్తులో హైటెన్ష‌న్ వైర్ల‌లో చిక్కుకున్న పరిస్థితిని మనం చూడవచ్చు.దాంతో వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు.సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో జ‌మ్ములో రికార్డు చేసిన‌ట్టు అనిపిస్తోంది.

జూన్ 18న తుపాన్ కార‌ణంగా స్కూట‌ర్ ఆ వైర్ల‌లో చిక్కుకుంద‌ని కొంతమంది భావిస్తున్నారు.ట్విట్ట‌ర్ యూజ‌ర్ స్వ‌త్‌కాత్ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేయగా ఆ వీడియో వెలుగు చూసిందని చెప్పుకోవాలి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ వీడియోపై ప‌లువురు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.కొందరు ఫన్నీగా ఇది ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ అయి ఉంటుంది.అందుకే డైరెక్ట్ చార్జింగ్ అని ఇక్కడ కామెంట్ చేయడం గమనించవచ్చు.

Advertisement

తాజా వార్తలు