రాహుల్‌గాంధీపై సుప్రీం సీరియ‌స్‌

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ఆర్ఎస్ఎస్ పై చేసిన వ్యాఖ్య‌ల‌పై త‌క్ష‌ణం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుంటే త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటామంటూ సుప్రీం కోర్టు హెచ్చ‌రించింది.

మహాత్మా గాంధీ హత్య వెనుక ఆర్ ఎస్ ఎస్ హ‌స్త‌ముందంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్య‌ల‌పై ఆర్‌ఎస్ఎస్ దాఖలు చేసిన పరువు నష్టం దావాపై మంగళవారం సుప్రీంలో విచారణ జరిగింది.

జస్టిస్ దీపక్ మిశ్రాలతో నేతృత్వంలోని బెంచ్ కేసును విచారిస్తు, మార్చి 2014లో మహారాష్ట్రలోని థానే జిల్లాలో భివాండీ వద్ద ఒక పార్లమెంటరీ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆదారాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది.అయితే రాహుల్‌ గాంధీ త‌ర‌పు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రతిపాదన నిరాకరించార‌ని, త‌మ వాద‌న‌లు వినిపించేందుకు ఇద్ద‌మేన‌ని స్ప‌ష్టం చేసారు.

దీంతో త‌దుప‌రి విచార‌ణ ఈ నెల 27న జ‌రుగుతుంద‌ని న్యాయ‌మూర్తులు కేసు వాయిదా వేసారు.

బాలయ్య హీరోయిన్ మంచి మనస్సు.. ఏకంగా 251 జంటలకు పెళ్లిళ్లు చేయించిందిగా!
Advertisement

తాజా వార్తలు