ఎస్బీఐలో ఈ అకౌంట్ తెరవండి... రూ.40 లక్షల బెనిఫిట్ పొందండి?

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( State Bank Of India ) గురించి భారతీయులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

ఈ బ్యాంక్ తన కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వివిధ రకాల స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం నేడు చేకూరుతోందనేది నిర్వివాదాంశం.

ఈ క్రమంలోనే ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ను( Salary Account ) ఓపెన్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చని తెలుపుతోంది.పొందే వేతనాన్ని బట్టి ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

విషయంలోకి వెళితే 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ వేతనం కలిగిన వారు ఎస్బీఐ నుండి "రోడియం అకౌంట్" ( Rhodium Account ) పొందవచ్చు.అదేవిధంగా ఒక్క లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల మధ్య వేతనం పొందే వాళ్లు "ప్లాటినం అకౌంట్"ను( Platinum Account ) పొందవచ్చు.అలాగే 50 వేల కంటే ఎక్కువ వేతనం వచ్చేవాళ్లు "డైమండ్ అకౌంట్"ను( Diamond Account ) పొందే అవకాశం కలదు.

ఇక 25,000 నుంచి 50,000 మధ్య వేతనం వచ్చేవాళ్లు "గోల్డ్ అకౌంట్," 20,000 రూపాయల లోపు వేతనం వచ్చేవాళ్లు సిల్వర్ అకౌంట్ ను తీసుకునే అవకాశం కలదు.ఇక ఈ అకౌంట్ ను కలిగి ఉంటె పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డెత్) బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది.

Advertisement

ఈ అకౌంట్లను కలిగి ఉన్నవాళ్లు లాకర్ రెంటల్ చార్జీలపై( Locker Rental Charges ) 50 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం కలదని సమాచారం.ఈ అకౌంట్ ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఉచితంగా పొందవచ్చునట.డీమ్యాట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ సర్వీసులను సైతం ఈ శాలరీ అకౌంట్ ద్వారా సులువుగా పొందవచ్చు.

ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో 2 నెలల వేతనాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.కాగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసినవారు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

Advertisement

తాజా వార్తలు